ఠక్కునచెప్పండి పురాణప్రశ్నలు-సమాధానాలు. డా.బెల్లంకొండనాగేశ్వరరావు. 1)ఆదిత్యులు, సూర్యునిరూపాలైన వీరిపేర్లేమిటి? 2) ఆదిశేషువుతల్లి ఎవరు? 3)వరూధిని సోదరునిపేరేమిటి? 4) హిరణ్యాక్షునిరాజధానిపేరేమిటి? 5) ఉంచవృత్తి అంటే? 6) ఉలూకునితండ్రిపేరేమిటి? 7) శ్రీకృష్ణుని కుమారుడు అనిరుధ్ధుడు ఇతనిభార్యపేరేమిటి? 8) దేవయానితల్లి పేరేమిటి? 9) ఏలాపుత్రుని తల్లిపేరేమిటి? 10) కంసునితండ్రిపేరేమిటి? సమాధానాలు:1)ధాత-మిత్రా-ఆర్యమాన-శక్రవరుణ-అంశ-భాగ-వివస్వత-పూష-సవితృ-త్రష్ట-విష్ణు. 2) కద్రువ.3)ఇందీవరాక్షుడు. 4) కనకగిరి.5) భిక్షాటన.6) శకుని.7) ఉష.8) ఊర్జస్వతి.9) కద్రువ.10)ఉగ్రసేనుడు.


కామెంట్‌లు