చదువుతో పాటు క్రీడలు కూడా అవసరము: శ్రీమతి చందన దీప్తి ------------------------------------------------------------------------------------------- శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్. చిన్న శంకరంపేట గ్రామంలో గల తెలంగాణ మోడల్ స్కూల్ , కాలేజీలో శ్రీ మెలాని ఫోమ్ సంస్థ ఏర్పాటు చేసిన క్రీడా మైదానం ప్రారంభోత్సవా ని కి ముఖ్య అధితిగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్.పి. గారు మాట్లాడుతూ: ప్రతి విద్యార్థి చదువుతో పాటుగా వ్యాయామం, క్రీడలపై కూడా శ్రద్ధ చూపాలని క్రీడలతో మనాసిక ఉల్లాసం లభిస్తుందని, క్లిష్టమైన పరిస్థితులలో తట్టుకోగల శక్తి సామార్ద్యాలు పెంపొంధించుకోగలమని, తద్వారా శారీరకంగా ,మానసికంగా ధృడంగా ఉంటామని అన్నారు. అలాగే క్రీడలవల్ల చదువుతో పాటు ఉద్యోగాలలో క్రీడా కోటా కింద రిజర్వేషన్ వుంటుంది కాబట్టి క్రీడా పోటీలలో పాల్గొని ఉద్యోగాలు సాదించి తాము చదువుకున్న కళాశాలకు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొని రావాలని విధ్యార్థులకు సూచించారు.


కామెంట్‌లు