హాలికుడు! --------------- హలముతో పొలమును దున్ని పంటలు పండించే ఓ హాలికుడా! దేశమందలి ప్రజలను నీ బిడ్డలని భావించి వారి ఆకలిని తీరుస్తావు పగలనక,రాత్రనక ఎండనక ,వాననక కష్టపడే ఓ రైతన్నా! నీకు వేలాది వందనాలు ఇంత చేసిన నీకు గౌరవం ఇవ్వకపోయినా పట్టించుకోవు నేలతల్లి ఒడిలో పచ్చని మొక్కలను నాటి ఆనందించే ఓ కర్శకుడా! అధికారుల నిర్లక్ష్యానికి దళారుల మోసాలకు బలైపోయి బతకలేక పురుగుల మందు తాగే దుస్థితికి వచ్చిన ఓ సైరికూడా! తీసుకున్న అప్పుకు ఎక్కువ వడ్డీలు కడుతూ చివరి శ్వాస వరకు వ్యవసాయం చేసి నెలతల్లిని సంతోషపెట్టే పెద్ద కొడుకులా ప్రాణాలను ఇచ్చి అయినా పంటలను పండిస్తావు అందుకే నీకు వేలాది వందనాలు రైతే దేశానికి వెన్నెముక జై కిసాన్! -మహమ్మద్ సయ్యద్ జాని హైదరాబాద్


కామెంట్‌లు