ప్రణయమా ? ప్రళయమా ? ----------------------------- ఏప్రిల్ 16, 1972, ఆదివారం. గోపి,నేేేను జిల్లా పరిషత్ ఆఫీసుకు చేరేసరికి సరిగ్గా ఉ‌దయం 8గంటల 30 నిమిషా లైంది. ఆఫీసు గేేేటు తీసి ఉంది అంటే ఎవరో వచ్చి ఉండాలి అనుకున్నాం.లోపలకెళ్ళిచూసాం.నైట్ వాచర్‌ కనిపించాడు. ఏం బాబు వచ్చారన్నాడు.ఏం చెప్పాలో అర్థంకాలే !పి ఇ వో గారు,ఎడ్యుకేషన్ గుమస్తా సత్యనారాయణగారువస్తా‌రేమో నని వచ్చాం.ఈరోజు ఆదివారం కదబాబూ!ఈరోజురారండీ. రేపు సోమవారం కదండీ. అప్పుడొస్తారండి. ఆ విషయం మాకు తెలుసులే అని మనసులో అనుకున్నాం. ఏదో ఒకటిమాట్లాడాలికదా కొంత సమాచారం లాగడానికి. అయితే ఇంకెవరూ లేరా అని అడిగాడు గోపి. ఇంకెవరూ లేకేమండీ.మీకు కావాలంటే పి ఇ వొ గారి బంట్రోతు మొదటి అంతస్థులో ఉన్నాడండీ. కావాలంటే వెళ్ళండి అన్నాడు. బ్రతుకుజీవుడా అనుకుంటూ పై అంతస్తుకు నడిచాం. ఒక గదిలో ఏదో శబ్దం వినిపిస్తోంది. అది.పి ఇ వో గారి గది. అక్కడ ఒక ఏభై ఏళ్లకు పైబడిన మనిషి ఫైళ్లు దులుపుతూ బస్తాలో కెక్కిస్తున్నాడు.మమ్మల్నిచూసి ఏం బాబూవచ్చారు? అని అడిగాడు. అసలు విషయం చెప్పాం .ఛైర్మన్ గారు సంతకం చేసిన దగ్గర నుండీ పి ఇ వో గారు నిన్న ఆఫీసుకు రానంత వరకూ నేనెలాఎదురు చూసానో.చెబుతూ నిన్నంతా ఆ ఎదురు చూపు వలన భోజనం కూడా లేదని దీనంగా మొహం బెట్టి చెప్పాను. నిజానికి జరిగింది కూడా అంతే ! పైగా అమ్మమ్మ కలలోకి వచ్చి నానిద్రను.పాడు చేసింది. నామాటలు, నీరసించిన ముఖం చూసిన ఆ ముసలాయనకు ( అటెండరుకు ) జాలి కలిగినట్టుంది. " బాబూ! ఇదిగోండి .ఈ ఫైల్ ను చూడండి. బహుశా మీదే అవ్వొచ్చు" అని ఇచ్చాడు. ఆ ఫైల్ లో ఉన్న సబ్జెక్ట్ చూసాను. నాది కాదన్నాను. " బాబూ ! మీ అప్లికేషన్ మీద ఛైర్మన్ బాబుగారు నీలం ఇంకుతోనా, రెడ్ ఇంకుతోనా , గ్రీన్ ఇంకుతోనాఏ ఇంకుతో సంతకం చేశారు బాబు అని అడిగాడు. ఏమో తెలియదన్నాను. ఏం రంగులురా బాబూ ఈ రంగుల ప్రపంచంలో. ఇక్కడ కూడా ఈ రంగుల మాయలేనా అనుకున్నాను. నేను వచ్చిన బస్సులో నా ప్రక్కన కూర్చున్న పెద్ద మనిషి మొదటిసారిగా ఈ రంగుల సంతకాల గురించే చెప్పాడు. నాకు బుర్ర తిరిగినంత పనయింది. నా ముఖకవళికలు మారిపోయాయి. ఇంతలో ఆ ముసలాయన అక్కడ వేరేగా ఉన్న. ఒకే ఒక్క ఫైల్ ను తీసిచ్చి చూడమన్నాడు. ఫైల్ తీసిన నేను సబ్జెక్ట్ లో నా పేరుండడం, తరువాత టెక్కలి హైస్కూల్ అని ఉండడంనేను, మా ఫ్రెండ్ గోపి చూసాం.ఆనందంలో మునిగిపోయాం. మనసు చల్లబడి ప్రశాంతత ఏర్పడింది. ఆ ముసలాయన చేతిలో ఒక రెండు రూపాయలు పెట్టాం. ఆ రోజుల్లో పావలాకు కప్పు"టీ "ఇచ్చేవారు. రెండు రూపాయలిచ్చేసరికి అతని ముఖం సంతోషంతో నిండిపో యింది. పి ఇ వొ గారి ఇంటి అడ్రస్ కూడా ఎందుకైనా మంచి దని అతని నుండి సేకరించాం. అడ్రస్ చెబుతూ"ఎందుకండి బాబూ ! సంతకాలు చేయించి మూడు గంటలకే తెచ్చేస్తాను కదా" అన్నాడు. అలాగే అని చెప్పి కాలేజీ హాస్టల్ కు వెళ్లి పోయాం. భోజనం చేసి గోపి, నేను హాస్టల్ నుండి బయలుదేరిమధ్యాహ్నం రెండు గంటలకే జిల్లాపరిషత్ ఆఫీసుకు చేరుకు న్నాం. అలా చేరుకుని అక్కడున్న నైట్ వాచర్‌ తో మాట్లాడు తూ ఎటెండ‌ర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఇంతలో భయంకరమైన గాలి,వడగళ్లతో కూడుకున్న వాన రెండు గంటలు పైబడి భీభత్సాన్ని సృష్టించింది. అక్కడక్కడ చెట్లుకూడా కూలిపోయాయి. కొన్ని కరెంట్ స్థంభాలు నేలకొరిగి పోయాయి.కరెంటు వైర్లు తెగిపోయాయి.పూరిల్ల పై కప్పులు ఎగిరిపోయాయి. ఈ భీభత్సం కనీసం రెండు గంటల పాటు జరిగింది. మళ్ళీ ఎప్పుటిలా ఎండ ఎక్కిపోయింది. మూడు గంటల కొస్తామని చెప్పిన అటెండర్ వర్షం తగ్గి అరగంటవు తున్నా. రాలేదు. నైట్ వాచర్‌ నడిగితే మరి అతను రాడని తేల్చి చెప్పేసాడు. నైట్ వాచర్‌ ను పి ఇ వొ గారి అడ్రస్ నడిగి కన్ఫర్మ్ చేసుకున్నాం.పి ఇ వొ గారింటికి బయలుదేరి ఆవీధి చేరుకున్నాం. పి ఇ వొ గారిల్లు మరో వంద గజాల దూరంలో ఉంది.ఇంత లో ఒక కుర్రాడు గోపి వయస్సు ఉంటుంది. మాకెదురుగా వస్తున్నాడు. దగ్గరకు వచ్చిన తరువాత " నివ్వేంటి ఇలావస్తున్నావ్ ! " అన్నాడు.. " జిల్లా పరిషత్ పి ఇ వొ గారింటికి " అన్నాడు గోపి. "మా నాన్నగారే ఆ పి ఇ వో గారు " అన్నాడు ఆ అబ్బాయి. " అయితే ఒకపని చేసిపెట్టు. ఇతను మా ఫ్రెండ్. మా నాన్న గారు ఇతన్ని టీచర్ గా వేయించారు. పి ఇ వొ గారి సంత కాలు అయ్యాయో లేదో ఒకసారి చూస్తావా ? " అన్నాడు గోపి. " సంతకాలు అన్నీ అయిపోయాయి. నేనే ఫైల్స్ మానాన్న గారికి అందించా " నని చెప్పాడు ఆ అబ్బాయి. ఇంతకీ ఈ అబ్బాయి ఎవరో తెల్సా ? ఇతను గోపి బి. ఏ క్లాస్ మేట్, రమేష్. ( సశేషం )--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి. ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు