లాంతరు,బుడ్డీ..... మా చిన్నప్పుడు మా పల్లెలో కరెంటు ఉండేది కాదు. బుడ్డిలు,లాంతర్లు ఉండేవి.పాఠశాలనుండీ 4 మైళ్ళు నడిచి ఇంటికొచ్చాక, పెద్దబావి దగ్గర కాళ్లు చేతులు కడుక్కొనేవాణ్ని. మిద్దె ఇంట్లో దేవుళ్ల పటాలుండేవి.మాకు చిత్తూరు జిల్లాలో వెంకటేశ్వరస్వామే కులదైవం. తిరుపతి మా ఊరికి 90 మైళ్లు.స్వామి వారి పటం ఁకిందుగా దీపం పెట్టు కోవడానికి చిన్న గూడు ఉండేది. ఇత్తడి దీపాలుండేవి. వాటిని ముగ్గు పిండితో కడిగి, శుఁభంచేసి నూనె పోసి, దూది వత్తులు రెండు జా౦ుుంట్ గా వేసి దీపం వెలిగించి, మూడు, నాలుగు దేవుడు పద్యాలు చెప్పుకుని, నమస్కారం చేసుకునే వాడిని.ఒకవయసు వచ్చాక. పల్లె ల్లో చాలా పనులు మాకు మేమే చూసి నేర్చుకునేటోళ్లం. ఎవరూ చెప్పేటోళ్లుకాదు. ఈపూజపనికూడా రెండోతరగతినుండే అమ్మనుచూసి నేర్చుకున్నా.అక్కకు చిన్నప్పుడే పెళ్లైన కారణంగా మా ఇంట్లో అన్ని పనులు చంఁదన్న, నేను చేసేవాళ్లం. బావి నుండి నీళ్లు తోడడం అన్నచెస్తే, నేను కుండల్లో తెచ్చి తొట్టెలు నింపడం, పూలచెట్లకు పోయడం చేసే వాణ్ని. అన్నీ మట్టి కుండలే వుండేవి. మట్టి తొట్టెలు వుండేవి.మట్టితో చేసిన కుండ ల్లోనే అన్నం, సంగటి వండడం అమ్మ చేసేది. ఉదయమే అన్నా, నేను ఇంటిముందర పేడ నీళ్లు చల్లేవాళ్లం.మాఇంటిముందర విశాలమైన జాగా వుండేది.పండుగలప్పుడు కూడా అమ్మకు అన్నిపనుల్లో మా సహాయముండేది. చిన్న రోకలితో వేరుశెనగ చట్నీ రోట్లో మేమే రుబ్బేవాళ్లం.ఇంట్లోనే పెద్ద రాతిమధ్యలో పెద్దగుంట పెడితే అది రోలు. దాన్ని ఇంట్లో ఒకచోట నేలపై బిగించి పెట్టి వుండేవారు. మేం ఉదయం ఈ పనులు చేసుకుంటే, అమ్మ వంటచేసి క్యారియర్ కట్టించేది.7గంటలకే బయలుదేరి నాలుగు మైళ్లు నడిచి బడికి వెళ్లేవాళ్లం.9 గంటలకంతా బడికి చేసేవాళ్లం. మాతోపాటు రామచంద్రా రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, చెన్నయ్య, నా అన్న, పక్కపల్లెలనుండీ ఇంకా కొందరు మాతో చేరే వారు.ఆడపిల్లలు ఎవరూ లేరు. దూరం కాబట్టి వారిని పంపేవారుకాదనుకుంటా. సాయంతో మళ్లీ 6గంటలకు ఇంటికి వచ్చేవాళ్లం. సాయంత్రం లాంతరు కున్న చిమ్ని (గాజుది)ముగ్గు పిండితో తుడిచి శుఁభంచేసి, కిరోసిన్ పోసుకుని, అగ్గిపుల్లతో లాంతరు వత్తిని వెలిగించే వాళ్లం. కాంతి, వెలుతురు బాగా వచ్చేది. దీపం మండగా, మండగా చిమ్ని నల్లగా మసికట్టేది. కాబట్టి రోజూ దానిని ముగ్గు పిండితో కడుక్కోవాలి. రోజూ ఇదొకపని. ఇప్పుడు స్విచ్ వేస్తే లైట్ రడీ.బుడ్డీలు కూడా వుండేవి. అవి చిన్నడబ్బాల్లా వుండేవి. లాంతరు కన్నా చిన్నవి. వాటికి వత్తి వుండేది. వత్తి పైకి, కిందికి లేవడానికి పక్కన ఁస్కూ వంటిది ఉండేది. వత్తి కాలే కొద్దీ అరగిపేయేది.దానిని ఁస్కూ తో పైకి లేపుకోవాలి.వాటికి కిరసనాయిలు పోయాలి. కిరసనాయిలు వాటికి ఇంధనం.ఇలాంటివి ఁపతి ఇంట్లో రెండు మూడు వుండేవి. ఆ గుడ్డి దీపపు కాంతిలో సాయంత్రమే 7 గంటల లోపే సంగటి ముద్దలు లేదా అన్నం తినేసేవాళ్లం. మేము లాంతరు వెలుగులో 10 గంటలవరకు చదువుకుని పడుకునేవాళ్లం.ఇప్పుడు కాంతివంతమైన లైట్లు వున్నా చాలా మంది చదవరు.... మేమెప్పుడు అనారోగ్యం బారిన పడలేదు. ఆరోగ్యంగా వుంటూ గుట్టలు,చెట్లు, కొండలు అవలీలగా ఎక్కేసే వాళ్లం. ఆదివారం మా కొండలకెళ్లి కట్టలు తెచ్చుకునే వాళ్లం. అవే మాకు వంటచెరకు. గ్యాస్ స్టౌ లు లేవప్పుడు.... ఆ రోజులే వేరు. కాలం మారింది. టెక్నాలజీ మారింది. మనుషులు మారిపోయారు. సెల్ ఫోన్ల బారినపడి మానవసంబంధాలే లేకుండా పోతున్నాయ్...- యం .వి. రమణ


కామెంట్‌లు