అన్ని రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ: తమిళిసై ---------------------------------------------------------------- గంగా- యమున సంగమంగా విరాజిల్లుతూ...లౌకిక వాదానికి తెలంగాణ ప్రతీకగా నిలుస్తోందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. మత కలహాలు సృష్టించే వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని పేర్కొన్నారు. తొలినాళ్లలో విద్యుత్‌ కోతలు, నీటి సమస్యలు ఎదుర్కొందని.. అయితే అనతికాలంలోనే వాటిని అధిగమించిందని తెలిపారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు. (సాక్షి సౌజన్యంతో)


కామెంట్‌లు