సుదగాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష సామాగ్రి పంపిణీ## యాద్రాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని బి.యన్ తిమ్మాపూర్ గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్ధిని, విద్యార్థులకు అందరికీ శనివారం సుదగానీ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుదగాని హరి శంకర్ గౌడ్ గారు ఎగ్జాజమ్స్ ప్యాడ్స్ మరియు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పిన్నెం లత రాజు గారు స్థానిక యమ్ .పి.టి.సి ఉడుత శారద అంజనేయులు గారు , భువనగిరి మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి గారు, మాజీ సర్పంచ్ రావుల అనురాధ నందు , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్ గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు రాధ గారు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యాకమిటి చైర్మన్ ఉడుత మహేంద్రర్ గారు, ప్రాథమిక పాఠశాల చైర్మన్ పిన్నెం అనురాధ గారు, బి.యన్ టి స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ , రావుల రాజు , నకిరేకంటి నర్సింహ్మ గౌడ్ , ఉడుత అంజనేయులు , బాలయ్య ,శివకుమార్, నకిరేకంటి చైతన్య గౌడ్ అధ్యాపక బృందం మరియు గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుదగాని హరి శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ విద్యార్థులు కష్ట పడి క్రమశిక్షణతొ చదివితేనే మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకి చెరుకొంటరని చెప్పారు.అదేవిధంగా పేదలు, మద్య తరగతి ప్రజలు అన్ని విధాలగా ఎదగాల అంటె విద్య ఒకటే మార్గమని అన్నారు. అదేవిధంగా సింగిల్ విండో మాజీ చైర్మన్ ఎడ్ల సత్తి రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు కష్ట పడి చదివి మంచి ఫలితాలు సాదించి గ్రామాన్నికి మరియు పాఠశాలకు మంచి పేరు తేవాలని అన్నారు. అదే విధంగా ఫౌండేషన్ చైర్మన్ హరి శంకర్ గౌడ్ గారిని పాఠశాల అధ్యాపక బృందం మరియు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు


కామెంట్‌లు