నెమిలేటి నిజాలు...! 1. నా కవిత్వమొక చెమట చుక్క శ్రమ సౌందర్యమే దాని ముడిసరుకు! 2. నా కవిత్వమొక నీటి బిందువు హృదయ శుద్ధిక ఉత్ప్రేరకం! 3. నా కవిత్వమొక దీపం కాళికా అవిటి లోకానికి దారి దీపం! 4. నా కవిత్వమొక అరుణ పతాకం అనచబడ్డ వారి చేతిలో విజయకేతనం! 5. నా కవిత్వమొక ఆకలి కేక అన్నార్తుల పాలిట అన్నం ముద్ద! 6. నా కవిత్వమొక ఇలా పాట యువ తరానికి ఉత్సాహ గీతిక! 7. నా కవిత్వమొక ప్రేమ పావురం విశ్వాని కంతా శాంతిని పంచు! 8. నా కవిత్వమొక నీటి చెలమ బాటసారులకు దాహార్తిని తీర్చు! 9. నా కవిత్వమొక కన్నీటి బొట్టు అభాగ్యుల కష్టాల కొలిమి నార్పు! 10. నా కవిత్వమొక డప్పు శబ్దం వాడ బతుకుల్లో దళిత వ్యాకరణం! 11. నా కవిత్వమొక రుధిర మందారం అచేతనులకు చైతన్య గీతం! 12. నా కవిత్వమొక బీజాక్షరం రేపటి ప్రపంచానికి నీడనిచెట్టు! --డాక్టర్ నెమిలేటి తిరుపతి 9490182636


కామెంట్‌లు