కరోనా శత పద్యాలు (ఆటవెలది)- ఉండ్రాల రాజేశం 1) చైననందు పుట్టి చకచక పారుతూ చేతులట్టుకున్న చేరిపోవు పాడు రోగమొచ్చి కీడును శంకించి కదలవట్టె చూడు కష్టమెట్ట 2) దగ్గరున్న చాలు దగ్గు దమ్ములతోడ అంటుకుంట వుంది ముట్టుకున్న పాము యెలుక పంది పాపత్ములు తినగా రోగమొచ్చినాది రాగమెట్టి 3) చిన్న పెద్దయనక చీమకుట్టిన తీరు ఒంటిలోన చేరు వోర్పుతోడ కలిసి మెలిసినట్టు కదలాడు జనులందు నిలిచి పోవుతుంది నిక్కముగను 4) కంట నిలువకున్న వెంటనుండు కరోన వృద్ధ జనుల చేరి భయము జూపి ప్రాణ సంకటాన వణుకులు పుట్టించి చంపుతుంది నేడు చైన పురుగు 5) మందు మాకులేక మరణ మృదంగమై చావు మేళ మొదలు చైననందు ఆగమైన జనులు యాస్పత్రులందున లక్షలాది జనులు శిక్షపడిరి 6) ప్రజలు కదులుతుండ్రి వ్యాపార వృత్తిన దేశ దేశమందు చైన పురుగు వేగిరమున కదిలి వేల మందిన జేరి నిలిచి వెడలుతుంది నింగినేల 7) ఇటలి నందు జేరి యింటింటికి నడిచి అంధకారమందు నలమటించ చావు కేకపెట్టి చదరంగ క్రీడలా కాటి కెళ్ళుతుండ్రి ఇటలినందు 8) ముట్టరాదు శవము పట్టనివ్వరు గాని గుట్ట గుట్టగాను కట్టిపెట్టి కాల్చుతుండ్రి శవము కన్నీటి దారలై కుక్క చావు లాగ లెక్కలేదు 9) ఇరుగు పొరుగు యనక ఇటలి స్పెయిన్ ఫ్రాన్స్ బ్రిటన్ ప్రజలనందు సోకి బాధపెట్టి చిరిగి పోయినాది చిత్రమైన బతుకు విస్తు పోయినారు విజ్ఞులంత 10) దొంగ దొరలు లేరు దోషాలు చూడలే చంపువాడు లేడు చావువచ్చె జాతి వైరమనక జాలి లేకుండను చావు మేళ మోగు శరములాగ


కామెంట్‌లు