కరోనా ఆటవెలది పద్యాలు 101) లక్షణముగ జనులు లాక్ డౌన్ ను జేసినా వ్యాధి పెరుగుతుండె వాడలందు మించిపోక ముందు మే మూడు వరకంటు పెంచినాడు మోడి పెర్మితోను 102) జాతి రక్షనందు జనులంత మెచ్చిరి ఇంట వుంటమనిరి యింపుగాను దేశమంత కట్టు దిక్కులే మురిసినయ్ మంచి పనికి నడుచు మనుషులంటు 103) ప్రజల బాగు కొరకు పథకాలు రచియించ మంత్రివర్గ మెట్టి మనసు విప్పి ఏడు వరకు పెంచి తోడుగాను కెసిఆర్ ముఖ్యమంత్రి గాను ముచ్చటించి 104) మొండి ధైర్యమందు ముందుకు కదులుతూ ప్రాణమున్న చాలు పైసలెంత కష్టపడి బతికి కలితోని పోరాడి విజయమొందు దాము వీరులార 105) పక్క రాష్ట్రమందు ప్రతిపక్ష పోటుతో గాడితప్పినాయి పాడిగాదు మైకులందు నిలిచి మాటల యుద్దంబు ఆంద్ర రాష్ట్రమంత నాగమాయె 106) ఆర్థికంబు లేక యతుకుల బొంతయి ఆగమైనదంత యవనియంత అప్పులన్ని జేసి తిప్పలు పడుటయే తప్పదనిరి యంత తలుచుకుంట 107) పెట్టుబడుల ఖిల్ల పెద్ద మహారాష్ట్ర వణుకుతుంది నేడు కునుకులేక అధిక సంఖ్యతోడ యగ్ర తాంబులమును పొందుతుంది వగచి పూటపూట 108) దండి జనులు వున్న దారవి జిల్లాలో వేల సంఖ్యలోన వెలుగుచూసి ఆసియంబులోన యనిరి లేబర్ అడ్డా ముప్పు పొంచుతుంది తుప్పుపట్టి 109) పిలిచి జర్నలిస్ట్ ల ప్రెస్ మీట్ కలయికన ధైర్యమిచ్చుతుండు దండివాడు కిటుకులన్ని చెప్పు కెసిఆర్ పలుకులకు బాధ మరచుతుండ్రి ప్రజలు మదిన 110) దేశ రక్షనందు దివ్వె నరేంద్రుడై జాతి నుద్దెశించి ఖ్యాతి నొంది గల్లి ముచ్చటలను డిల్లీన పసిగట్టి సకలమందు నిలుచు సవ్యశాచి ఉండ్రాళ్ళ రాజేశం


కామెంట్‌లు