కరోనా శత పద్యాలు (ఆటవెలది)- ఉండ్రాల రాజేశం 11) శాస్త్రవేత్తలంత సకలము శోధించి చేతులెత్తినారు చాతగాక మందు దొరకదంటు మాటను దాటేసి దూరముండమంటు వారుయనిరి 12) ఆగ్ర రాజ్యమంటు నాగమై అమెరికా చిద్రమైంది నేడు చితికి చితికి హద్దులేని వ్యాధి పెద్దన్న పాత్రను చిన్న బుచ్చుతుంది శిరసువంచి 13) రాజు మంత్రి యంటు రాబందు సవ్వడి కుళ్ళ బొడుచుతుంది మళ్ళి మళ్ళి కనికరంబు లేక కైలాస యాత్రగా సాగనంపుతుంది చావుబాజ 14) విద్య వైద్యమందు విజ్ఞాన సౌదమై ధనిక దేశమనిరి ధరణినందు నూతనంబుగల్గు న్యూయార్క్ పట్టణమున జనుల ఘోష వినను శరణు శరణు 15) ఆజ్ఞ చెప్పుతాడు అధ్యక్ష టంపుయే కదలలేక వుండు గడపదాటి వ్యాధి నాపలేక పథకాలు పారక కంటనీరు పెట్టి కరుణయనెను 16) చదువు విద్యయంటు సకల దేశాలందు తిరిగి వచ్చినారు దేశమునకు వారి వెంట నిండ పాడు కరోనాను పట్టు కొచ్చినారు జట్టుగాను 17) జగతి ముచ్చటించి జాగ్రతలను తెల్పి బందొబస్తు చేసి బాసటుండి పనులు యెన్ని వున్న పక్కనెట్టి ప్రధాని యుద్దబేరి వేసె హద్దుగీసి 18) అంటు వ్యాధి లేదు అసలు మనకు రాదు మచ్చటించుతున్న ముఖ్యమంత్రి ఆగమాగమందు నాపినాడు అసెంబ్లి బడులు మూయమంటు బందుయనెను 19) మోడి కదిలివచ్చి ముచ్చట పెట్టుతూ జనత కర్ఫ్యు యంటు జయముయనెను చిన్న పెద్దలంత చేయెత్తి జైకొట్టి మద్దతిచ్చినారు మనసునిండ 20) సకల జనులు కలిసి జనమంత యింటుండి కాలు కదపలేదు గడపదాటి దేశ సేవకులకు ధీరుల చప్పట్లు మారు మ్రోగినాయి మహిన దరువు


కామెంట్‌లు