కారోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న విషయం విదితమే.. దేశ విపత్తు నిమిత్తం రాష్ట్రంలో ఎప్రిల్14 వరకు ఉన్న లాక్ డౌన్ ను ప్రజల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏప్రిల్ 30 వరకు పొడుగించింది. ఈ మేరకు ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. అందులో భాగంగానే స్కూల్ విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించి తద్వారా ఇంట్లో ఉన్న విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సహకరినాచాలని కోరారు. దేశ ప్రధాని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ లాక్ డౌన్ విధించడం వల్ల ఇంటికే పరిమితమైన కుటుంభసభ్యులు అందరూ ఒకే చోట ఉంటూ ఆట పాటలతో కాలక్షేపం చేస్తున్నారు. V. Raghuram


కామెంట్‌లు