*విదేశీ గడ్డపై దిక్కుతోచని మన విద్యార్థులకు ఆసరాగా నిలుస్తున్న యూకే జాగృతి* *15 రోజుల నుండి నిద్రాహారాలు మాని శ్రమిస్తున్న వాలంటీర్లు* *ప్రశంసలు కురిపిస్తున్న ప్రవాస తెలంగాణ విద్యార్థులు, అభినందించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత* లండన్ లో లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థి మసాడి నవీన్.. శ్రీమతి కవిత గారికి ట్విట్టర్ ద్వారా తన పరిస్థితిని వివరించి సహాయం అడిగాడు. ఆశ్చర్యకరంగా కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే తెలంగాణ జాగృతి యూకే భాద్యులు మునగాల కిశోర్ ఫోన్ చేసి నవీన్ ను దగ్గరిలోని ఒక ప్రాంతానికి రావలసిందిగా కోరారు. మరో 40 నిమిషాలలో నవీన్ తనకు కావలసిన నిత్యావసరాలను అందుకున్నాడు. తన ట్వీట్ ను చూస్తారో లేదో అనుకున్న మాసాడి నవీన్ దేశం కాని దేశంలో గంట వ్యవధిలోనే తనకు సరుకులు అందడంపై కవిత గారికి జాగృతి యూకే శాఖకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇలాగే మహిపాల్, మనోహర్ రెడ్డి, రమ, వినయ్, ఖలీద్, సాయి మాంచెస్టర్ లోని వినీల, మరెందరో మందికి తెలంగాణ జాగృతి యూకే శాఖ ఈ కరోనా కష్ట కాలంలో వెన్నుదన్నుగా నేలుస్తుంది. లండన్ లో లాక్ డౌన్ నేపథ్యంలో భారతీయులు.. అందునా ప్రధానంగా అక్కడ విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్న సంగతి తెలిసిందే. లండన్ తో పాటు యూకే లోని వివిధ ప్రాంతాలలో దిక్కుతోచక ఉన్న విద్యార్థులకు అవసరమైన నిత్యావసర సరుకులను గంటల వ్యవధిలోనే అందిస్తున్నారు. మరోవైపు జాగృతి అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న అభ్యర్థనలకు అనుగుణంగా కవితక్క ఆదేశాల మేరకు వేగంగా స్పందిస్తూ వారిని చేరుకుంటున్నారు.యూకే జాగృతి అధ్యక్షులు సుమన్ బల్మూరి తదితరుల ఆధ్వర్యంలో నేటికి 15 రోజుల నుండి భారతీయ విద్యార్థులకు సేవలందిస్తున్నారు. ఈ సంధర్భంగా జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బల్మూరి మాట్లాడుతూ ఏ విద్యార్థికి ఏం కష్టమొచ్చినా అధైర్యపడవద్దని తమను సంప్రదించాలని కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో జాగృతి భాద్యుల సహకారంతో త్వరలోనే మరిన్ని సహాయ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని అన్నారు. ఎన్నో ఆశలతో విదేశీ గడ్డమీద చదువు కునేందుకు వెళ్ళి అనుకోకుండా ఇబ్బందుల్లో చిక్కుకున్న తెలంగాణ బిడ్డలకు ఈ కష్ట కాలంలో సద్దిమూటై ఆదుకుంటున్న జాగృతి యూకే శాఖను కల్వకుంట్ల కవిత గారు ట్విట్టర్ వేదికగా అభినందించగా పలువురు ఎన్నారైలు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


కామెంట్‌లు