త్రిమూర్తులకు వందనం : కోవిడ్ 19 మహమ్మారి వైరస్ మన దేశానికి అంటుకుని నెల రోజులు దాటిపోయింది. మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి లు వైరస్ నివారణ కు తీవ్ర మైన కృషి చేస్తూ వైరస్ గొలుసు తెగడానికి లాక్ డౌన్ ప్రకటించారు. ప్రభుత్వానికి మద్దతు గా పేద మధ్య తరగతి బేధం లేకుండా అందరు కూడా ఐకమత్యం గా కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కోవడానికి తు చ తప్పకుండ లాక్ డౌన్ పాటిస్తున్నప్పటికీ దేశం లో ఒకటి రెండు సంఘటన ల వలన వైరస్ పెరగడం మన నాయకులను, మనల్ని మానసిక క్షోభ కు గురిచేశాయి. ఒక వైపు కఠిన తరమైన కోవిడ్ 19 వైరస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ముమ్మరంగా సాగుతూ చివరి దశ లో ఉండగా, వారం రోజుల్లో *ఫ్రీ కరోనా* గా మారుతుందని ఆశించిన తరుణంలో కొందరు పనిగట్టుకొని కోవిడ్ వైరస్ ను విజృంబింప చేయడం యావత్ భారదేశాన్నే ఆవేదన కు గురి చేసింది. జనవరి 20 అమెరికా లో తొలి కోవిడ్ 19 కేసు నమోదు అయి లక్షా 70 వేలకు పెరిగింది. ఇటలీ లో 2 నెలల్లో లక్ష కు పెరిగింది. ఆ దేశాలలో పోల్చి చూస్తే మన దేశం లో చాలా నెమ్మదిగా పెరిగింది. కానీ ఢిల్లీ *నిజాముద్దీన్ మర్కజ్ మసీద్* ఘటన లో దేశమంతా ఒక్కసారి కేసులు ఉదృతమయ్యాయి. *తబ్లీగీ జమాత్* సంస్థ సభ్యులు వైరస్ వ్యాధి వ్యాపిస్తుందని తెలిసినప్పటికీ, వేల మంది సమావేశం కావడం, జాగ్రత్త లు తీసుకోక పోవడం వల్ల దేశం మొత్తం కూడా వేల సంఖ్య లో కోవిడ్ 19 వైరస్ బాధితులు పెరుగుతున్నారు. ముందునుండి వైద్యులు చాలా ఓపిక తో రోగులకు వైద్యసేవలు చేస్తూనే వున్నారు. వైద్యులు వారి సుఖాలను త్యాగం చేస్తూ, తిండీ తిప్పలు కూడా సమయానికి లేకుండా, ప్రాణాలకు తెగించి క్వారంటైన్ ఐసోలేషన్ వార్డులలో విధులు నిర్వర్తిస్తున్నారు. నర్సులు, *వైద్యులు,* ఫార్మాసిస్టులు, వైరాలజి నిపుణులు నిస్వార్థ భావంతో సేవ చేసే వీళ్ళు వైద్య దేవుళ్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. వీరి సేవను యావత్తూ భారత దేశమే గుర్తించి వీరిపై గౌరవ సూచకంగా చప్పట్ల రూపంలో అభినందనలు కృతజ్ఞతలు తెలియచేసాము. అటువంటి వైద్య సేవ చేసేవారిపట్ల అనైతిక చర్యలకు కొందరు వ్యక్తులు పాల్పడడం దేశద్రోహంగా భావించ వలసి వస్తుంది. ప్రాణాలు కాపాడే వైద్యులకు సహకరించకుండా తప్పించుకోవడం, ఎదురుదాడుల కు దిగడం వంటి సంఘటనల ను తీవ్రంగా పరిగణించి దాడులు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పోలీస్ లు కూడా కోవిడ్ 19 వైరస్ నియంత్రణ కు ప్రాణాలు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. అడపా దడపా సంఘటన ల లో చట్ట ప్రకారమే సిక్షించినప్పటికీ, అది ఓ పెద్ద తప్పుగా భూతద్దం లో చూపించి నట్టు మీడియా రాద్ధాంతం చేయడం తగదు. పోలీస్ లేకపోతే క్రమశిక్షణ ఉల్లంఘనలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక వైద్యులతో సమానంగా *పోలీస్* లు కూడా కనపడే దేవుళ్ళు గా చెప్పవచ్చు. ఆ తర్వాత పారిశుధ్య కార్మికుల పాత్ర మరువరానిది. ఏ దేశం లో చూడని విధంగా మన దేశం లో వీరు ప్రధానిచే గౌరవింప బడ్డారంటే వీరి ప్రాధాన్యత ను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అట్టడుగు ప్రాంతాలు మొదలుకొని వీరి సేవ క్షేత్ర స్థాయిలో ఉంటుంది. రోడ్లు, వీధులు శుభ్రం చేయడం, రసాయనాలు చల్లడం వంటి అనేక సేవలు చేసే *పారిశుధ్య కార్మికులు* కూడా దేవుళ్ళే అని చెప్పవచ్చు. ఆ విధంగా వైద్యులు, పోలీస్ లు, పారిశుధ్య కార్మికులు వీరిని త్రిమూర్తులు గా భావిస్తూ వారికి దేశం తరపున మరోసారి వందనాలర్పిద్దాం భారత మాతను కాపాడుకుందాం. --Ch. వెంకట రమణా చారి, జర్నలిస్ట్, హైదరాబాద్, 949333119


కామెంట్‌లు