"రంగు పడుద్ది" పుట్టిన విధంబెట్టిదనిన- దివాకర బాబు మాడభూషి గుంటూరులో నేను హైస్కూల్ లో చదువుకునే రోజుల్లో 1964..68 గుంటూర్లో Chain batch అని ఒక gang ఉండేది. వాళ్ళు కొట్లాడుకునేప్పుడు "రంగు పడుద్ది" అనే వాళ్ళు. అంటే కొడితే బ్లడ్ పడుతుందని అర్ధం లో వాడేవాళ్ళు. ఆ పదం అప్పుడు మైండ్ లోముద్రించుకుపోయింది అనుకుంటాను. దాదాపు 30 సంవత్సరాల తర్వాత "ఘటోత్కచుడు" సినిమాకి రచన చేసేటప్పుడు గుర్తొచ్చింది. ఐతే ఆ పదం విలన్ కి వాడితే వయొలెంట్ గా వుండేది. కామేడియన్ వాడడం వల్లా ఆ పాత్రధారి స్వర్గీయ AVS గారికి రంగు పడుద్ది తప్ప వేరే సంభాషణలు లేక పోవడం వల్లా మీ అందరికీ నచ్చి ఇంకా జనం నోళ్ళలో నానుతోంది. అప్పట్లో "రంగు పడుద్ది" పదాన్ని ఒక పెయింట్స్ కంపేనీ పబ్లిసిటీకీ కూడా వాడుకుంది.!!


కామెంట్‌లు