పాఠశాలల్లో ఉపాధ్యాయుల సఖ్యత అవసరం పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయుల చొరవ తీసుకో వాలి. ప్రధానోపాధ్యాయుని పాత్ర అత్యంత ముఖ్యమైనది. ఉపాధ్యాయుల సహాయ సహకారాలు పాఠశాల అభివృద్ధికి అత్యంత అవసరం. ప్రధానోపాధ్యాయుడు పాఠశాల ప్రగతికి ముందుకు పోతుంటే ముళ్లకంపలు పరిచేవారుంటారు. వాటిని దాటుకు వెళ్ళాలి. మనం ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు మనకు పేరు వచ్చేస్తుందనే ఆరాటంకొంతమందిలో కొట్టుమిట్టాడుతుంది. కానీ నిజానికి ఆ కార్యక్రమం విజయ వంతమైతే అంతకన్నా ఆనందం ఏముంటుంది?ఆవిజయం అందరిదీను. నేను పాలకొండ జూనియర్ కాలేజీలో బి. ఇడి అసిస్టెంట్ గా పనిచేసి 1977 డిశంబర్ 5 బలి జిపేట హైస్కూలుకు ట్రాన్ఫర్ మీద వచ్చాను.బలిజిపేట హైస్కూల్1957నాటిది. చాలా పురాతన భవనం.పెద్ద స్కూల్. నేను ఆస్కూలు లో చేరేనాటికి పదకొండు వందలు దాటిన స్ట్రెంగ్త్. ముప్పై మంది స్టాఫ్. ప్రధానోపాధ్యాయునితో సహా 90 శాతానికి మించి స్టాఫ్ అక్కడి లోకల్ వాళ్ళే ! అంతా కొత్త వాతావర ణం. వింత వింత పోకడలు. నేను 1972 ఏప్రిల్ 17న ఉద్యోగంలో చేరాను.1976లో పాలకొండ వచ్చాను.టెక్కలిహై స్కూల్ హెచ్. ఎం., స్టాఫ్ తమ వృత్తిని తాము దైవంగా తలచేవారు. హెచ్. ఎం. గానీ, గుమస్తాగానీ ఎవరిదీ పైసా ఆశించేవారుకాదు. ఒకనాడు ఒక అమ్మాయి స్కూలు ఫీజు కట్టడానికి వచ్చింది. గుమస్తాగారు ఫీజు తీసుకుని, అందుకు తగ్గ రసీదును కూడా ఇచ్చేసి తనదగ్గర ( గుమస్తా దగ్గర ) 5 పైసలు లేనందున రసీదు వెనక్కి వ్రాసిచ్చారు. ఐదు పైసలే కదా ! అది ఏమాత్రం . ఈమాత్రం దానికి రసీదు వెనక్కి వ్రాసివ్వాలా అన్నాను ఆ గుమస్తా గారితో ! అందుకు ఆమె జవాబు చెబుతూ పిల్లల సొమ్ము అలా ఉంచకూడ దండీ మాష్టారు అనేవారు. ఇక ప్రధానోపాధ్యాయురాలి సంగతి ఆర్థిక కట్టుబాట్లు అంతకుమించి చాలా కఠినతరం గా ఉండేవి. అలాగే పాలకొండ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ ధర్మేశ్వరరావు గారు కూడా ప్రతీ విషయంలోను చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. ఉపాధ్యా యులు ఎవరి పనులువారు చేసుకుపోయేవారు. " నేను సీనియర్ టీచర్ ను వాడు జూనియర్ టీచరు. వాడికి వచ్చిన సబ్జెక్ట్ ఏమిటి " అని ఈర్ష్యా ద్వేషాలతో కొట్టుమిట్టాడుకునేవారుకాదు. అందరూ కలసిమెలసి స్నేహంగా ఉండిఎవరి పనివారు చేసుకుపోయే వారు.1972 నుండి1977 డిశంబర్ 4 వరకూ వారి ఆధ్వర్యంలో క్రమశిక్షణతో ముందుకు పోయేవాడిని. వృత్తిలో క్రమశిక్షణ, అవినీతి అంటే ఏమిటో తెలియని స్వచ్ఛమైన జీవితం వారి నుండే నేర్చుకున్నాను. అటువంటి వాతావరణం నుండి వచ్చిన నాకు బలిజిపేట స్కూల్ పరిస్థితులు అన్నీ వింతగా అనిపించాయి టీచింగ్ బెల్ అయిన వెంటనే క్లాసులకు వెళ్ళేవారు. అయితే ఒకరిద్దరు టీచర్స్ క్లాసుకు వెళ్లినట్టుగా వెళ్లి ఒక పదినిమిషా లలోనే స్టాఫ్ రూంకొచ్చి మేప్ కోసం లేదా ఛార్ట్ కోసం నటించి క్లాసులకు ఎగ్గొట్టేవారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు ఒకరినొకరు విమర్శించుకోవడం సర్వసాధారణం. దానికి కారణం ఉపాధ్యాయులు ట్యూషన్స్ చెప్పడమే. పరీక్షల నిర్వహణ కూడా సక్రమంగా జరిగేది కాదు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫస్ట్ క్లాసుల్లో పాసైనవారు కాలేజీలోజాయిన్ అయితే ఆ కాలేజీ మటాష్ అయిపోయేది. కాలేజీ రిజల్ట్స్ వీరినుండి అట్టడుగు స్థాయికి పోయేవి. నేనుబొబ్బిలి ఇన్ విజిలేషన్ కు వచ్చేవాడను. పరీక్షల నిర్వహణలో టెక్కలి, పాలకొండల్లో పరీక్షలు నిర్వహించే విధంగానే పరీక్షలను నిర్వహించేవాడిని. నా పిల్లలు పదవతరగతి పబ్లిక్ పరీక్షలు బలిజిపేట సెంటర్ లో వ్రాసినా ఏ నాడూ పరీక్ష సెంటర్ కు వెళ్ళడం" నా పిల్లలున్నారు జాగ్రత్తగా చూడండి" అని ఏనాడు చెప్పేవాడిను కాదు. సంవత్సరం పొడవునా కష్టపడి చెప్పడం, వారిచే చదివించి స్టాండర్డ్స్ పెంచడం మాత్రమే చేసేవాడిని. స్కూల్లో జి. కే టెస్టు పెట్టారు. మా పెద్దబ్బాయి కూడా ఆ పరీక్ష వ్రాస్తున్నాడు. చిన్న జీ. కే పుస్తకం మీద పరీక్షలు. పుస్తకం అంతా కంఠస్తా చేసాడు. అప్పటికి వాడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ప్రథమ శ్రేణి విద్యార్థికూడాను. ఆ జి. కే పరీక్షకు నేనేఛీఫ్ ను. ఇద్దరు ఇన్ విజిలేటర్లు కూడా ఉండేవారు. మా అబ్బాయి రూంకి ఉన్న ఇన్ విజిలేటర్ ప్రభాకరం‌ మాష్టారి అబ్బాయి కదా అని ఎక్కడ జవాబులు చెప్పేస్తారేమో ననుకుని ఇన్విజి లేటర్లకు ఎదురుగానే కూర్చున్నాను. ఫలితాలొచ్చాయి. అతి తక్కువ మార్కులు వచ్చాయి. వాడికంటే చాలా లో- స్టాండర్డ్స్ ఉన్న పిల్లలకు అత్యధికంగా మార్కులు వచ్చాయి. రెండు, మూడు రోజులు ఎడతెరిపి లేకుండా ఏడ్చాడు. కళ్ళు వాచిపోయా యి. డాక్టర్ తో విషయం చెప్పాను. హెచ్. ఎం అండ్ స్టాఫ్అందరూ స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ కు ఇలా జరిగిందేమిటి ? పరిస్థితికి బాధ పడ్డారు. మానసికంగా దెబ్బతిన్నాడని తెలుసుకొని హెడ్మాష్టరే ఒక పెన్ను, పుస్తకం బహుమతిగా ప్రేయర్ గ్రౌండ్ లో అసెంబ్లీ జరుగు తున్నప్పుడు అందజేశారు.టీచర్ అన్నవాడు నిరంతర శ్రామికుడై ఉండాలి. బలిజపేటలో టీచర్స్ లో చాలామంది లోకల్ వాళ్లేనని చెప్పాను. స్కూలులో ఉన్న విద్యార్థులంతా వాళ్ళ దగ్గరే ట్యూషన్ చదవాలి. లేకపోతే ఏవో సమస్యలు విద్యార్థులకు సృష్టించేవారు. పై ఊరుఉపాధ్యాయులు నాతో కలిపి 2, 3 ఉండేవారు. మాలో ఎవరు ట్యూషన్స్ చెప్పినావాడికేమొచ్చు వీడికేమొచ్చు అని పిల్లల ముందు, వారి తల్లిదండ్రుల ముందు అంటుండేవారు.నన్ను ఎక్కడికో ట్రాన్ఫర్ చేయించాలని ఎన్నోసార్లు ప్రయ త్నించారు. కానీ విఫల మయ్యారు. అలా చయడమే పనికొచ్చింది. చాలా రిఫరెన్స్ బుక్స్ చదివి పబ్లిక్ హాలిడేస్ లో కూడా స్పెషల్ క్లాసులు పెట్టేవాడిని. అలా ఐదు సంవత్స రాలు కష్టపడ్డాను. 1982 నుండి ఇంగ్లీష్ పత్రికలలో వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టాను. పబ్లీక్ లో ఒక మంచి ఇమేజ్ వచ్చింది కొత్త మాష్టారు బాగా కష్టపడుతున్నారని. కొత్త మాష్టారును పాతమాష్టారునయిపోయాను. ఇంతకు ముందు వాకాడ నాగేశ్వర రావుగారి దగ్గరకు నాతో వచ్చిన నాయకుడే బలిజిపేట మండల ప్రెసిడెంట్ అయ్యారు . అతని సాయంతో నన్ను మొదటిలో బాధ పెట్టిన ఇద్దరినీ ఆ ఊరులో నేను ఉన్నంత కాలం ఊరు పొలిమేరలకుదరిచేరనీయలేదు. ఇలా ప్రజలతో సత్సంబంధాలు పెంచు కొని స్కూలును అభివృద్ధి చేయడం జరిగింది. ఎలా అభి వృద్ధి చేసానో రేపటి రోజున తెలియజెప్పడం జరుగు తుంది. ( సశేషం ) - శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు