నేను బలిజిపేట వచ్చిన మొదటి సంవత్సరం. నేను 1977డిశంబర్ 7న వచ్చాను. ఇంగ్లీష్, సోషల్-స్టడీస్ ఎనిమి ది, తొమ్మిది, పదితరగతులకు చెప్పేవాడను. హాఫ్‌-ఈయర్లీ కొన్ని యూనిట్ టెస్ట్ లు, ఏడు, పది తరగతి పబ్లిక్ పరీక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేను ఇన్విజిలేషన్ చేసేటప్పుడు ముఖం కూడా తిప్పనిచ్ఛేవాడనుకాదు. ఆ విషయం పాఠశాలలో అందరికీ తెలుసు.మా స్కూలులో ఆ చుట్టు ప్రక్కల ఉన్న అప్పర్ ప్రైమరీ స్కూళ్ళకూ సెంటర్ అదే. నన్ను ఏడవతరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ కు ఇన్విజిలేటర్ గా వేసేవారు. ఆ వెయ్యడం కూడా ఇంగ్లీషు, సోషల్- స్టడీస్ పరీక్షల రోజుల్లో మా స్కూల్ పిల్లల గదులకు నన్ను ఇన్విజిలేటర్ గా వేసేవారు. నాకు ఎందుకో సంశయం వచ్చింది. పై ఊరు పిల్లలు కూడా ఈ సెంటర్ లో పరీక్ష వ్రాస్తుండగా వాళ్ళ గదులకు నన్ను వెయ్యకుండా ప్రత్యేకంగా ఈ స్కూలు పిల్లల గదులకు సబ్జెక్ట్ టీచర్స్ ను వెయ్యడంలో గల ఆంతర్యం ఏమిటని ఆలోచించాను. హెడ్మాష్టరుతో సహా సుమారు 80% స్టాఫ్ లోకల్ వాళ్ళే ! ఇన్వివిజిలేషన్ ఛార్ట్ వెయ్యడంవెనుక ఎవరి ఇన్ ఫ్లుయెన్సో ఉందని భావించాను. ఎందుకం టే 2,3 రూంలకే సబ్జెక్ట్ టీచర్స్ ను ప్రత్యేకంగా నియమిస్తున్నట్టుంది అనే ఆలోచన నాలో కలిగింది. ఇంగ్లీషు పరీక్షనాడునన్ను నేను అనుమానించిన గదులలో ఒకదానికి వేసారు. నా పద్ధతిలో నేను ఇన్విజిలేషన్ చేసుకుపోయాను. ఫలితా లు వచ్చేసరికి ఆ గదిలోనున్న ఇరవైమందిలో ఇద్దరు మాత్రమే పాసయ్యారు. అప్పటి నుండి ఏడవతరగతి పరీక్షలకు సామాన్యంగా వేసేవారుకాదు. ఒక సంవత్సరం మా అబ్బాయి ఏడవతరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాస్తున్నాడు. నాకు ఇన్విజిలేషన్ వర్క్ ఛీఫ్ సూపరింటెండెంట్ గారు వేసారు. మా అబ్బాయి పరీక్షలు వ్రాస్తున్నాడు కాబట్టి నన్ను ఇన్విజిలేషన్ వర్క్ నుండి తప్పించాలని జిల్లా విద్యాశాఖాధికారివారికి, ప్రధానోపాధ్యాయులు (ఛీఫ్ సూపరింటెండెంట్ ) వారికి వ్రాతపూర్వకంగా తెలియజేయడం జరిగింది. కానీ నన్ను ఇన్విజిలేషన్ వర్క్ నుండి తప్పించ లేదు. అయితే వారు చేసిన పనేమిటంటే నన్ను మా అబ్బాయి రూంకి ఇన్విజిలేషన్ వర్కుకు వేయలేదు. నేను బలిజిపేటలో పనిచేస్తున్నప్పుడు పాత హెడ్మాష్టర్మారిపోయి రేగ తిరుపతిరావు అనే కొత్త హెడ్మాష్టరు వచ్చా రు. అతను నీతినిజాయితీకి పెట్టిందిపేరు. చాలా స్ట్రిక్ట్ హెడ్మాష్టరుగా జిల్లా మొత్తంపై పేరుండేది. అతనికి రెండు సంవత్సరాల లోపే సర్వీసుండేది. అయినా జిల్లా పరిషత్అధికారులకు అతని స్ట్రిక్ట్ నెస్ పనికి రాలేదు. విజయనగరం డివిజన్ నుండి బొబ్బిలి డివిజన్ ఎడ్యుకేషన్ జోన్ లోనున్న బలిజిపేటకు బదిలీ చేసారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రెండు సంవత్సరాలలోపు సర్వీసు ఉన్నవారిని బదిలీ చేయ డానికి వీలులేదు. అటువంటిదీ అతనిని ఆ చివర నుండి ఈచివరకు విసిరేసారు.దాంతో అతనిలోనున్న సిన్సియారిటీ, డ్యూటీ మైండెడ్నెస్ తగ్గి చివర్లో అలా అలా పనిచేసుకు పోయేవారు. అయినా అతనికి వృత్తిపై ఉన్న మమకారం తగ్గలేదు. ఆ సంవత్సరం పదవతరగతి పరీక్షలకు ఛీఫ్ సూపరింటెండెంట్ గా ఉండవలసిన రేగ తి‌రుపతిరావుగారు ఆ డ్యూటీ నుండి తప్పుకున్నారు.జిల్లా విద్యాశాఖాధికారి వారుపదవ తరగతి పరీక్షల నిర్వహణ బాధ్యత నాకు తెలియకుండా నాపై పెట్టారు. ఆపాఠశాలలో పనిచేస్తున్న బి.ఇడి అసిస్టెంట్స్ అంతా నాకంటే సీనియర్సే ! అయినా వా‌రినందరినీ విడచిపెట్టి నన్ను పదవతరగతి పబ్లీక్ పరీక్షలఛీఫ్ సూపరింటెండెంట్ గా నియమించారు. మరి ఈపని హెడ్మాష్టరుగారి సలహాననుసరించి జిల్లావిద్యాశాఖాధికారి చేసారనిపించింది. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒక రాజకీయ పార్టీ నాయకుని కొడుకు పరీక్షలు వ్రాస్తున్నాడు. ఆ రాజకీయ నాయకుడంటే పడని మరో పార్టీ నాయకుడు ఈ జిల్లా మినిస్టర్ గారి దగ్గరకు వెళ్ళి బలిజిపేట సెంటర్ లోమాస్ కాపీయింగ్ జరిగిపోతుందని ఫిర్యాదు చేసారు. అప్పటి తెలుగు మొదటి పేపరు పరీక్ష మాత్రమే జరిగింది. తెలుగు రెండవ పేపర్ పరీక్ష ప్రారంభమై ఐదు నిముషాలు అయిందో లేదో పరీక్షల కమీషనర్ పరీక్ష సెంటర్కు వచ్చేసారు. ఇతను ఏమిటి ఇలావచ్చారనుకున్నాను. వచ్చీరాగానే అన్ని గదులు కలియతిరిగారు. విజయనగరం నుండి వచ్చిన అధికారికి ఏదో డ్రింకైనా కర్టెసీకి ఇవ్వాలి కదా ! లిమ్కా తెప్పించి ఆఫర్ చేసాను. కమీషనర్ గారుతీసుకోడానికి అంగీకరించలేదు. నేను ఏం అనకుండా కామ్ గా ఉన్నాను. మొదటి అరగంట నిర్విరామంగా అన్ని గదులు కలియదిరిగారు. ఎక్కడ ఏం దొ‌రుకుతుందా అని పెద్ద భూతద్దంలోనుంచి చూద్దామనుకున్న అతనికి ఏమీ లభించ లేదు. ఏమిటిది అని ఆలోచనలో పడ్డట్టున్నారు కమీషనర్ గారు. స్థానువులా నిల్చుండిపోయారు. ఇంతలో అటెండర్ ను పిలిచి కూల్ డ్రింక్ తెమ్మన్నాను. కూలింగ్ తగ్గిపోతుంది తీసుకోండని అందిచ్చాను. డ్రింక్ తాగుతూ " ఏమీ జరగపోతే మినిస్టర్ గారి వద్దకు కంప్లైంట్ ఎలా వెళ్ళింది ? ఎవరు చేసారు ? " అని నన్ను అడిగారు. ఏమో తెలియదండి అన్నాను. " ప్రభాకరం‌గారూ మీ పనులు మీరు చూడండి. నేను అలా రౌండ్స్ కు వెళ్ళొస్తానన్నారు.. కమీషనర్ గారు మళ్లీ రౌండ్స్ మొదలు పెట్టారు. ప‌రీక్ష అనంతరం వరకూ విరామం లేకుండా తిరిగారు. దేనిని ఎత్తి చూపాలో తనకు అర్థం కాలేదు. ఎగ్జామ్స్ కు సంబంధించిన రికార్డులు వెరీఫై చేసారు. పరీక్ష అనంతరం చేయవలసిన పనులు ఎలా చేస్తున్నానో, బండిల్స్ ఎలా కట్టిస్తున్నానో , పోస్టాఫీసుకు బండిల్స్ ను ఎవరి సహాయంతో పంపిస్తున్నానో, రిజస్టర్డ్ పోస్ట్ లో ఆ బండిల్స్ పంపిన తరువాత పోస్ట్ మాష్టారు ఇచ్చిన రసీదు టపాల్స్ రిజిస్టర్ లో ఏరోజుకారోజుది అంటిస్తున్నానో లేదోనని అబ్జర్వ్ చేసారు. బోజనాలు తెప్పించాను. బోజనం చేస్తుండి " ఇదంతా ఏమిటి ? ఏదో మీ మీద బురదజల్లాలనే ప్రయత్నంతోనే ఎవరో మినిస్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చారు " అన్నారు. స్కేడ్ గా రోజూ ఎవరినో ఒకరిని పంపిస్తే నాకు కూడా కొంత సహాయం చేసినట్టవుతుంది సార్ అన్నాను. అలాగే చూస్తాలే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన తొమ్మిది రోజులకుతొమ్మిది స్కేడ్ లొచ్చాయి. అలా నాకు తలనొప్పి లేకుండా పరీక్షలు విజయవంతంగా ముగిసాయి. అలా కంప్లైంట్ ఇవ్వడమే మంచిదైంది. నేను నిర్వహించవలసిన పర్య వేక్షణ అధికారులే చేసిపెట్టారు. అందుకు వారికి మనసులో కృతజ్ఞతలు తెలుపుకున్నాను. (సశేషం ) -శివ్వాం. ప్రభాకరం‌, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.


కామెంట్‌లు