అక్షర సేద్యం పత్రిక రెండవ సంచిక ఆవిష్కరణ. ప్రియాతి ప్రియమైన బాలల్లారా ! అక్షర సేద్యం బాలల సాహిత్య త్రైమాసిక పత్రిక మొదటి సంచికను జనవరి 2020లో మీకు అందించాము కదా. ఇప్పుడు రెండవ సంచిక (ఏప్రిల్ 2020 ) ను 15వ తేదీన ఆవిష్కరించాము.ఇందులో 30 మంది విద్యార్థులు వ్రాసిన కథలు,కవితలు,గేయాలు, పద్యాలు, మణి పూసలు, లేఖలు ఉన్నాయి. వీటితో పాటు వందే మాతరం ఫౌండేషన్ కార్యదర్శి మాధవరెడ్డి గారు విద్యార్థులు కోసం ఎన్నో విలువైన సూచనలు ఇంటర్వ్యూ రూపంలో ఇచ్చారు.మనం మరిచిన పాతకాలపు వస్తువుల విశేషాలు వివరించే "రాజు గారి ముచ్చట్లు " అంబేద్కర్ ముఖ చిత్ర కథనం ,ప్రభుత్వ బడుల సక్సెస్ స్టోరి మొదలగు అంశాలతో మీ ముందుకు వచ్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ పత్రిక ని పీడీఎఫ్ రూపంలో మీకు పంపుతాము.మీరు ఈ క్రింది నంబర్లను సంప్రదించండి. భైతి దుర్గయ్య . 9959007914 వేల్పుల రాజు . 9701933704 గుజ్జు అశోక్ కుమార్.9908898382 /- సంపాదక వర్గం అక్షర సేద్యం బాలల పత్రిక. రామునిపట్ల, సిద్దిపేట జిల్లా


కామెంట్‌లు