25 శనివారం పరశురామ జయంతి సందర్బంగా. స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడింది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు. పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణంలో వివరించబడింది.ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు. పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకువిద్యలుపదేశిస్తాడనీ, తరువాతి మన్వంతరములోసప్తర్షులలో ఒకడవుతాడనీ కథ. పరశురాముడు పూర్ణావతారము కాదనీ, అవశేషావతారమనీ అంటారు. రుచీకుడు అనే మహర్షీ కి సత్యవతి అనే రాకుమార్తె కు మహిమాన్వితంగ జన్మించిన వాడే పరశు రాముడు. గాదిరాజు కూతురు అయిన సత్యవతి నీ రుచీకుడు మోహించగ తపస్సు చేసుకునే ఋషికి నా కుమార్తె ను ఎలా ఇయ్యాలి అని మనస్సు లో అనుకోని వెయ్యి గుర్రాలను తెచ్చి ఇస్తే నా కూతురు ని ఇస్తా అని అవి కూడా నల్లని చెవులు కలిగిన తెల్లని గుర్రాలు తీసుకు రావాలని షరతు విధించాడు గాధి రాజు. తపస్సు ద్వారా దేవతల రాజు అయిన ఇంద్రుణ్ణి మెప్పించి వేయి గుర్రాలను గాధి రాజు కు ఇవ్వగా అన్న మాట ప్రకారం తన కూతురు సత్య వతి నీ ఇచ్చి వివాహం చేస్తాడు రాజు. గాధిరాజు తనకు పుత్ర సంతానము కావాలని ఎం చేస్తే తన కోరిక నెరవరుతుందని రుచీకున్ని అడగగా తన తపశక్తి తో రెండు రకాల హోమం యొక్క హవ్యాలను తయారు చేస్తాడు. రుచీకుడు తన భార్య సత్యవతి ని పిలుచు కుని ఇక్కడ రెండు రకాల హోమ ద్రవ్యా లు ఉన్నాయి మొదటి దాన్ని చూపిస్తూ ఇది నీవు తాగు ఉత్తమ లక్షణము లు గల ద్విజోత్తముడు లభిస్తాడు రెండవ దాన్ని చూపిస్తూ ఇది మీ తల్లి గారికి ఇవ్వు క్షత్రియ పుత్రుడు క్షత్రియ నాశకుడు అజేయు డైన వాడు జన్మిస్తాడు అని ఋచీక మహాముని స్నానానికి వెళ్తాడు. కొంచం సేపటి కి సత్యవతి తల్లి దండ్రులు వస్తారు. వారికి రాగానే భర్త ఋచీకుడు చేసిన హవ్యాల గురించి చెప్తుంది. తల్లి బిడ్డలు ఇరువురు కూడా శుచిగా స్నానం చేసిన పిదప ఋచీకుడు ఇచ్చిన హోమ ద్రవ్యాలు తాగుతారు. కానీ ఋచీకుడు చెప్పినట్టు గ కాకుండా మరచి పోయి ఒకరికి అని చెప్పింది ఇంకొకరు తాగు తారు. ఇంతలో స్నానం ముగించు కొని జరిగిన విషయం గ్రహించి సత్యవతి తో నీ కడుపు లో పరమ క్రూరుడు అయిన కుమారుడు నీ తల్లికి బ్రహ్మ తేజస్సు కలిగిన కుమారుడు జన్మిస్తాడని చెప్తాడు. దీనికి సత్యవతి బాధ పడగ కొడుకు క్రూరత్వం మనుమనికి వచ్చేలా అనుగ్రహిస్తాడు ఋచీకుడు. ఋచీకుడు సృష్టించిన హోమ ద్రవ్యాన్ని గ్రహించిన గాధి రాజు కు విశ్వామిత్రుడు జన్మిస్తాడు. బ్రహ్మర్షి అవుతాడు. రుచికునికి జమదగ్ని మహా ముని జన్మిస్తాడు. జమదగ్ని కి పరశు రాముడు జన్మించి క్రౌర్యం తో అందరినీ వధిస్తాడు. శ్రీ మహా విష్ణువు అంశ తోనే పరశు రాముడు జన్మించి నప్పటికీ పరమేశ్వరుణ్ణి గురువు గ చేసుకొని తపస్సు చేసి క్షత్రియ యుద్ద విద్యలన్నీ నేర్చుకొని పరశు అనే అస్త్రాన్ని శివుని దగ్గర నుండి పొంది పరశు రాముడు గా పేరు తెచ్చు కున్నాడు. పరశు రాముని తల్లి రేణుక దేవీ చిత్ర రథుడు అనే గందర్వున్ని చూసి లిప్త కాలం మోహానికి గురి కావడం చూసిన జమదగ్ని తల్లిని చంప మని కొడుకులను అదేశింపగ కొడుకులు మేము ఆ పని చేయమని చెప్పడం జరిగింది. ఆ సమయం లోనే పరశు రాముడు అక్కడికి రాగ తండ్రి కోపాన్ని చూసి విషయం ఏమిటి అని అడగ్గా జరిగింది చెప్పగా పరశు రాముడు తండ్రి ఆజ్ఞను సారం తల్లిని అన్న తమ్ముల నందరిని పరశు రాముడు చంపేస్తాడు. తరువాత కోపం శాంతించి న తండ్రి అనుగ్రహం తో మళ్లీ వాళ్లనందరిని బ్రతికించు కుంటాడు పరశు రాముడు. మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించిన రాజు హైహయ వంశు డయిన వీరుడు కార్త వీర్యార్జునుడు. ఇతనికి వేయి చేతులు ఉన్నాయి. ఈ రాజు కు ఒక్కసారి అగ్ని దేవుడు కొండలు అడవులు కొండల కింద కుగ్రమాలు ఆహారం గ ఇచ్చారు. ఇవ్వన్నీ ఒకనాడు అగ్ని దేవుడు దహించ వేయ సాగాడు వశిష్టుడు లేని సమయం లో తన ఆశ్రమం నీ కూడా కాల్చాడు కార్తవీర్యార్జునుడు అగ్ని కి కాపలా ఉన్నాడు. ఇంతలోనే వశిష్ట మహా ముని రావడం ఇతర అడవుల తో పాటు నా తపో భూమిని దహించి వేసినందుకు నీ వేయి చేతులను పరశు రాముడి చే వదింప బడతాయని శపిస్తాడు. పరశు రాముడు లేని సమయం లో కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి రాగ తన దగ్గరా ఉన్న కామధేనువు సహాయం తో రాజపరివారానికి షడ్రశోపేతంగా మహర్షీ విందు ఏర్పాటు చేయగా, ఆ కామధేనువు ను తనకి ఇవ్వమని అడుగుతాడు కార్తా వీర్యర్జునుడు. తను ఇవ్వ అనగా బలవంతంగా కామ దేనువును మహిష్మతి నగరానికి తీసుకువెళ్తాడు రాజు. ఈ విషయం తెలిసిన పరశు రాముడు కోపంతో కార్థా వీర్యార్జుని పై దండెత్తి అతని వేయి బాహువులను ఖండించి చంపుతాడు కార్తవీర్యార్జునిని పది వేల మంది కుమారులు పరశు రాముడు లేని సమయం లో వచ్చి జమదగ్ని నీ వధించి పగ తీర్చు కొంటారు. తల్లి రేణుక పరశు రాముడు రాగానే జరిగింది అంతా చెప్పగా మాట్లాడకుండా వెళ్లి గొడ్డలి పట్టుకొని ఆమడకు ఒక అడుగు వేస్తూ మహిష్మతి పురం నగరం ఒక్క నగరమే కాకుండా క్షత్రియ జాతి పై ఆగ్రహించి ఇరవై ఒక్క మార్లు దండ యాత్ర చేసి క్షత్రియ సంహారం గావిస్తాడు. తదనంతరం అశ్వమేధ యాగం చేసి కశ్యప మహర్షి కి భూమిని దానం చేస్తాడు. అందుకే భూమిని కష్యపి అనే పేరు వచ్చింది. భూమండలం మొత్తం నాకు దానం చేశావు కదా ! నీవు భూమి పై నుండి వెళ్ళమని కశ్యపుడు అంటాడు పరశు రాముడితో..మిగిలిన రాజ వంశం వాళ్ళని అయిన భతికించ వచ్చు ననే ఆలోచనతో ఆదేశిస్తాడు కశ్యపుడు. సరే నని పరశు రాముడు సముద్రం చీలి పోయి స్థానం ఇవ్వగా దాని లోనికి ప్రవేశించి తన జన్మ సార్థకం చేసుకుంటాడు----* రచన : Ch. వెంకటరమణా చారి, స్వతంత్ర జర్నలిస్ట్, హైదరాబాద్, 9493331195.


కామెంట్‌లు