శతక పద్య రచన పూర్తి కరోనా శతక పద్యాలు (ఆటవెలది)-ఉండ్రాల రాజేశం 61) దాతలంత వచ్చి దండిగా విరాళాలు ఇచ్చుతుండ్రి చాల వేగిరమున ఆర్థికాన లోటు ఆలోచనలు మాని పప్పు బియ్యముప్పు పంపినారు 62) కూలి నాలి మాని కూర్చున్న బీధలు చౌక ధరలయందు సరుకుతెచ్చి పూట గడుపుతుండ్రి పూరి గుడిసెనందు పనులు మరిచినట్టి పల్లెవాసి 63) పించ నిచ్చినారు పిలుచుకుంట కలిసి రాష్ట్ర మేదియైన కష్టమనక బీధలెందరున్న బాధ్యత మాదంటూ పంచుతుండ్రి నిజము పండు ఫలము 64) దేశభక్తి చాట దీపాలు వెలిగించి దైర్య మిచ్చినారు ధరణి సుతులు తొమ్మిదైన వేళ తొమ్మిది నిమిషాలు జ్యోతి వెలుగుతుంది ఖ్యాతిపెంచ 65) భారతాన చూడు భవ్య చరిత్రను నిండు పున్నమల్లె వెండికాంతి అందరేకమౌతు ఐక్యతా రాగమై స్ఫూర్తి నింపినారు కీర్తినొంద 66) జగతినంత చూడు సకలము చీకట్లు వెలుగుతున్న గడ్డ వీరభూమి దివ్య కాంతి తోడ దీపాల వెలుగులై స్ఫూర్తి నింపుతుంది చుట్టు నిలిచి 67) పైసలన్ని దాచి పంటలు కొనుటకు పల్లెలందు జేర పరుగులిడుతు ఉన్న ధాన్యమంత దన్నుగా కొనుమంటు ఆర్డ రేసినారు ఆదుకొనుచు 68) రైతు నేస్తమంటు రైతన్న రాజ్యమై గింజలన్ని కొంటు గిరినిదాటి కిటుకులన్ని చెప్పి కెసిఆర్ తెలంగాణ పల్లెలందు కాంట పంపినాడు 69) బతుకు దెరువు కొరకు పట్నమందున జేరి పనులు చేయుతుండ్రి పల్లె ప్రజలు పాడురోగమొచ్చి పనులన్ని బందయే తిరిగి వెళ్ళుతుండ తిప్పలుగను 70) సూది మందులిచ్చి శూన్య కరోనాను తరుముతుండు చూడు తండ్రిలాగ వ్యాధి వచ్చి నిలిచె వైద్యుని చుట్టునా భయము వదిలి కదిలె ప్రతిభతోడ


కామెంట్‌లు