శతక పద్య రచన పూర్తి కరోనా శతక పద్యాలు (ఆటవెలది)- ఉండ్రాల రాజేశం 71) భరత వీరులున్న భారత ఖండంబు పసిడి సిరుల తల్లి భరతమాత కష్ట నష్టమైన కలిసి కరోనాను సాగనంపుతారు చైన చెంత 72) కంటికి కనబడక ఒంటిలో నిల్చుతూ ప్రాణ ముప్పు తెచ్చు పాపకారి భారతాన చేరి భయ బ్రాంతులను చూపి మోడి దెబ్బతగిలి ముడుచుకొనెను 73) పోకిరోళ్ళ ఆట పోలీసు పట్టతూ తలుపుమూయ జనుల తరుముతుండు డర్టీ వ్యాధి నుండి డాక్టర్ కరోనాను తనువు నందు మాన్పి తన్నుతుండు 74) గాజు గీమునందు గడుపుట మేలయ్య మాట విన్న చాలు మంచి జరుగు బయట వుంది చూడు పాడు భూతము నిల్చి పట్టి చంపుతుంది ముట్టుకున్న 75) భారతాన రోజు బందుల పర్వము కాలు కదలకున్న కడుపు మాడు ఎడ్ల బండి కొట్టి ఎవుసంబు నమ్మిన రైతు నాదుకొమ్ము రాజ్యమునను 76) కష్టమెంత వున్న కదిలెసైనికులెల్ల యింట జనము నుంచి బయట నిలిచి ప్రజల రక్ష కొరకు పట్టి కరోనాను బొంద పెట్టుతుండ్రి పుడమిలోన 77) జంతు పక్షులన్ని జగతిలో తిరుగగా మనుషులంత నేడు మౌనదీక్ష కంట పడక దాగి యింట కరోనంటు బంధిలైరి జనులు బాటమాని 78) పదుల సంఖ్యదాటి వందలు చేరుతూ మార్గ మెట్లనంటు మధనపడుతు కట్టు దిట్టమైన జట్టును పంపించి భద్రతిస్తువుంది బాసటగను 79) లక్షలన్ని పెట్టి లారి ఆటో బస్సు కొనియు నడుపుతున్న కూలబడిరి అప్పు కట్టుటెట్ల అసలు బతుకుటెట్ల ఆకమౌతువుండ్రి అడ్డగోలు 80) పదవ తరగతందు బడి పరీక్షలు ముగియలేక పోగ ముందుకేల చదువులన్ని ముగిసి చక్కగుండేదేట్ల మారుతుంది తేది మరల మరల


కామెంట్‌లు