కరోనా...మధురవాణి .............................. ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్ సెల్ నెం 9441333315 -------------------------------------------- నమస్కారం మరిచి కరచలనం చేసి/ పలకరిగించుట ఆరోగ్యానికి మంచిది కాదన్న/ కరచలనంతోనే కరోనా వ్యాధి వస్తుందని/ వైద్యులు చెప్పిన మాట నిజమన్న/ దూరం మరచి దగ్గర చేరి/ మాట్లాడుట ఆరోగ్యానికి మంచిది కాదన్న/ దగ్గరుండి మాట్లాడితే కరోనా వస్తుందని/ వైద్యులు చెప్పిన మాట నిజమన్న/ తుమ్మినప్పుడు రుమాలు పట్టుట మరచి/ తుమ్ముట ఎవ్వరికి మంచిది కాదన్న/ తుమ్ముతోనే కరోనా వ్యాధి వస్తుందని/ వైద్యులు చెప్పిన మాట నిజమన్న/ చేతులు సబ్బుతో కడుగుట మరచి/ ఆహారం తినుట మంచిది కాదన్న/ అశుభ్రతతోనే కరోనా వ్యాధి వస్తుందని/ వైద్యులు చెప్పిన మాట నిజమన్న/


కామెంట్‌లు