పిసినారి( బాలల కథ )అవంతి కాపురంలో మల్లయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు బట్టల వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదివచ్చాడు. భార్యా పిల్లల కన్నా డబ్బు మీదనే ఎక్కువ మక్కువ చూపేవాడు. భార్యా పిల్లల అవసరాలు కూడా పూర్తిగా తీర్చే వాడు కాదు. తన అవసరాలకు కూడా డబ్బు ఉపయోగించేవాడు కాదు. దానధర్మాలు చేసేవాడు కాదు. పిసినారి తనం చూపించేవాడు .భార్య పిల్లల ఆరోగ్యం క్షీణించిన పట్టించుకునేవాడు కాదు. ప్రతిరోజు సంపాదించిన డబ్బు మూటను తీసి, చూసి మురిసిపోయే వాడు. ఒక పెట్టెలో పెట్టి తాళం వేసే వాడు. కొంతకాలానికి ధనం మూట ఇంట్లో ఉంటే దొంగలు దోచుకుంటారే మోనని భావించాడు. అవంతి కాపురానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో దాచి పెడితేబాగుంటుందని భావించాడు. ఒకరోజు ఎవరికీ తెలియ కుండా నిర్మానుష్య ప్రదేశానికి పోయాడు. ఒక గోతిని త్రవ్వి నాడు. అందులో ధనము మూట పెట్టి, గోతిని మట్టితో పూడ్చి వేసి నాడు. దానిపై కంపను వేశాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ప్రతిరోజు ఎవరికి తెలియకుండా వెళ్లేవాడు. గోతిని తవ్వి ధనం మూట చూసి, సంతోషించేవాడు. మళ్లీ గోతిలో ధనం మూట పెట్టి గోతిని పూడ్చి వేసేవాడు. కంప వేసేవాడు. ఇలా రోజు చేస్తుండగా ఒకరోజు భూమయ్య అనే వ్యక్తికి మల్లయ్య మీద అనుమానం వచ్చింది. మల్లయ్య ప్రతి రోజు ఇదే సమయానికి ఎక్కడికి వెళ్తున్నాడు. చూద్దాం అనుకుని మల్లయ్య కు తెలియకుండా మల్లయ్య వెళ్ళిన నిర్మానుష్య ప్రదేశానిక భూమయ్య వెళ్ళాడు. మల్లయ్య చేస్తున్న తతంగం అంతా దాగుండి చూశాడు. మల్లయ్య ఇంటికి వెళ్ళిన తరువాత భూమయ్య గోతి దగ్గరకు వెళ్లి, గోతి తవ్వి నాడు. మూటను తీశాడు. మూట విప్పి చూసాడు. అందులో ధనం ఉంది. గోతిని ముందటి వలె పూడ్చి, కంప వేసి ఇంటికి మూట తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రతిరోజు వలే మల్లయ్య ధనం పెట్టిన చోటికి వచ్చాడు. గోతిని తోడి నాడు. మూట కనిపించలేదు. పెద్ద ఎత్తున రాగం తీసి ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుపు విని, కొందరు ప్రజలు అక్కడికి వచ్చారు. జరిగిన సంగతి తెలుసుకున్నారు. ఎవరికి ఉపయోగపడని ధనము ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అంటూ ధనం మూట కు బదులు బండను ఉంచి సంతోషించు మనీ పిసినారి మల్లయ్యకు చెప్పి వెళ్లిపోయారు. ..జాధవ్ పుండలిక్ రావు పాటిల్ సెల్ నెం.9441333315


కామెంట్‌లు