ప్రపంచ పుస్తక దినోత్సవ సందర్భంగా. నా కవిత! --డాక్టర్ నెమిలేటి..9490182636 -- పుస్తకాలే జ్ఞానవిత్తులు ---పుస్తకాలు ..... మహత్తర కాంతి కిరణాలు మనకున్న భ్రాంతి నెల్లా చెదరగొట్టి మసిబారిన మనసులలో జ్ఞానజ్యోతులను వెలిగించు దారిదీపాలు! అందుకే పుస్తకాలెప్పుడూ నా నేస్తాలే.... నా వంకర బతుకు రేఖను సరిదిద్ది నన్ను మనీషిని చేసిన నా ఆత్మ బంధువులు! పుస్తకం ముట్టాలంటే భయం కొందరికి... కానీ పుస్తకాలంటే నా అశుద్ద వాక్కును శుద్ధి చేసి పరిమళ భరితమైన భాషనిచ్చి నన్ను కవిని చేసిన కమనీయ కుసుమాలు! అంటరాని వాడివి నీ కెందుకురా చదువులంటూ గేలి చేసి అవమానించినోళ్ళ అవిటితనాన్ని పాతిపెట్టి సత్కవిని చేసి, సత్యాన్ని నేర్పి ఇంత సంతోషాన్నిచ్చి, ఇన్ని సత్కారాలందించినదీ ఈ పుస్తకాలే సుమా! పుస్తకాలంటే సంస్కృతి సంస్కారాలనందించి మానవత్వపు సుగంధాల నిచ్చే చల్లని కల్పతరువులు గదా ! అందరికీ ప్రపంచ కవితా దినోత్సవ శుభాకాంక్షలతో.... మీ డాక్టర్ నెమిలేటి.


కామెంట్‌లు