రాలుగాయి గాలిపటం ఎక్కడికెళ్తావే...? రామ చిలుకను చూద్దాము పరుగున వస్తావా.. జామచెట్టు ఎక్కి నాతో ఆడుకుంటావా... చిలుక కొరికిన జామపండు నాతో తింటావా... నింగి పైకి నన్ను నీతో తీసికెళ్తావా... చుక్కలతో చక్కగ మనం స్నేహం చేద్దామా... చందమామకు చక్కిలిగింతలు పెట్టి వద్దామా... సూరీనికి చెవిలో పాటలు వినిపించేద్దామా...!! రచన:శాంతి కృష్ణ 9502236670


కామెంట్‌లు