మానేరు ముచ్చట్లు- - చరిత్ర పరిశోధకులందరూ ఎలగందుల కాకతీయుల కాలం నుండి చారిత్రక ప్రసిద్ధి గాంచిందని చెప్పారు.దానికి ముఖ్యమైన ఆధారం చింతామణి శాసనమొక్కటే కనిపిస్తు న్నది.శాసనాన్ని బట్టి గణపతి దేవ చక్రవర్తి కాలం నుండి అని రూఢిగా చెప్ప గలిగినా అంతకు ముందు విషయాలను కూడా ఇతర శాసనాల ఆధారంగా కొన్ని విషయాలు చెప్పబ డ్డాయి. ఎనిమిదవ శతాబ్దము నుండి పదవ శతాబ్దముల వరకుసబ్బిసాయి రము వేములవాడ చాళుక్యుల అధీ నంలో ఉండి ఆపై క్రీ.శ. 973 నుండి కల్యాణి చక్రవర్తి ఆహవమల్లు బిరు దాంకితుడైన తైలపుని అధీనంలోకి వచ్చిందని నిన్న ముచ్చటించుకు న్నాం. తైలపుడు (973-997) మొదలుకుని సత్యాశ్రయుడు (997-1008),ఐదవ విక్రమాది త్యుడు (1008-1015),జగదేకమల్ల రెండవ జయసింహుడు (1015- 1042),త్రైలోక్యమల్ల మొదటి సోమేశ్వరుడు),భువనానికి మల్ల రెండవ సోమేశ్వరుడు (1042-1076), త్రిభువనమల్ల ఆరవ విక్రమాదిత్యుడు (1042-1076) వరకు సబ్బిసాయిర మండలమంతా దాదాపు వంద సంవత్సరాలు కల్యాణి చాళుక్యుల అధీనంలోనే ఉన్నదని పలు శాసనాల ద్వారా వెల్లడవుతున్నది. ఈ సమయంలో కాకతీయులు వీరికి సామంతులుగా ఉన్నారు.ఆరవ విక్రమాదిత్యుని కాలంలో కాకతీయ రెండవ బేతరాజు (అనుమ కొండ ప్రాంతపు సామంతరాజు)ను వెంట బెట్టుకుని ఆయన దండ నాయకుడు వైజ దండనాథుడు కళ్యాణి రాజధాని మాన్యఖేటకము నకు తీసుకుని పోగా చక్రవర్తి రెండవ బేతరాజుకు సబ్బి సహస్ర ప్రాంత పాలనాధికారాన్ని ఇచ్చాడు.అది సబ్బిసహస్రంలో కాకతీయుల తొలి అడుగు. కాని అప్పటికి పొలవాస ప్రాంతము మేడరాజు అధీనంలో ఉంది కనుక దక్షిణ ప్రాంతం కాకతీయుల అధీనంలోకి వచ్చింది. ఆ తరువాత వచ్చిన కళ్యాణి చాళుక్యులలో భూలోకమల్ల మూడవ సోమేశ్వరుడు(1126-1138), రెండవ జగదేకమల్లుడు(1138-1151), మూడవ తైలపుడు(1151-1163), మధ్యలో (1163-1183) దాకా తైలపుని ఓడించి గద్దెనెక్కిన కాలచూరి బిజ్జలుడు పాలించారు. అయితే బిజ్జలుని ఓడించి మళ్లీ గద్దెనెక్కిన కళ్యాణి చాళుక్య నాలుగవ సోమేశ్వరుడు (1183-1189) పాలించాడు.కాని ఇతడు బలహీనుడగుటచే అంతవరకు సామంతులుగా ఉన్న యాదవులు, హోయసలులు,కాకతీయులు స్వతంత్రులైనారు.ఆ విధంగా కళ్యాణి చక్రవర్తుల పాలన అంతమొందించ క్రీ.శ.1189 నుండి సబ్బి సాయిరము కాకతీయుల సంపూర్ణాధికారము లోనికి వచ్చిందని చెప్ప వచ్చు. అయితే క్రీ.శ.1076 నుండి క్రీ.శ.1160 వరకు ఇప్పటి జగిత్యాలకు సమీపాన గల పొలవాస రాజుల పాలన విశేషాలు కూడా తెలుకోవాల్సి ఉంది.అది రేపటి ముచ్చట్లలో .- రామ్మోహన్ రావు తుమ్మూరి


కామెంట్‌లు