పిల్లలం బడి పిల్లలం.. పిల్లలం బడి పిల్లలం చదువుల తల్లి సావిత్రి బిడ్డలం మహాత్మ జ్యోతిబాబు జాడలం ఈజాతి దిక్షూచి అంబేడ్కర్అడుగులం ॥ మహాత్మ॥ మా అమ్మ కలల పంటలం మా నాన్న కంటి వెలుగు దివ్వెలం ఈ భూమి పుత్రులం ఈ నేల గాయాల గురుతులం ॥ మహాత్మ॥ మా వాడ పూరి గుడిసెలం మా పల్లె పిల్ల బాటలం ఆ కొండ వాగుల్లో సెలిమెలం ఈ అడవి లోయల్లో చిలుకలం ॥ మహాత్మ॥ కష్టాల గోస మాది కన్నీటి గాథ మాది ఏటికి ఎదురీదే యోధులం దారితప్పక తీరాలు చేరుతం ॥ మహాత్మ॥ తరాల చెమట పరిమళం మేం ఈ దేశ ఆదిమూలవాసులం శాస్త్రాల సారాల వారధులం సమభావన కోరుకునే మానవులం ॥ మహాత్మ॥ మా తల్లి భాష మరువం మాదైన ఆశ విడువం ఇంగ్లీషు చదువు వదలం మహనీయుల అడుగుల్లో మాపయనం ॥ మహాత్మ॥ పిల్లలం బడి పిల్లలం చదువుల తల్లి సావిత్రి బిడ్డలం మహాత్మ జ్యోతిబాబు జాడలం ఈజాతి దిక్షూచి అంబేడ్కర్అడుగులం ॥ మహాత్మ॥ - గాజుల శ్రీదర్ ,9849719609.


కామెంట్‌లు