*పుడమి సాహితీ వేదిక ఆధ్వర్యంలో కరోనాపై చిత్రలేఖనం పోటీ* పుడమి సాహితీ వేదిక నల్లగొండ  వారి  ఆధ్వర్యంలో ఇటీవలనే కరోనాపై ఆన్లైన్ జాతీయ కవితల పోటీని విజయవంతంగా నిర్వహించిన విషయం అందరికీ విదితమే. అదే స్ఫూర్తితో పుడమి సాహితీ వేదిక  *కరోనా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు* అనే ప్రధాన అంశంపై  ఆన్లైన్ చిత్రలేఖనం పోటీ నిర్వహించుటకు మరోసారి మరోసారి మీ ముందుకు వచ్చింది. ఈ పోటీలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, ఎవరైనా పోటిపడవచ్చు. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. అవి ఒకటి పాఠశాల విభాగం, రెండు ఇతరుల విభాగం. పాఠశాల విభాగంలో పాఠశాల విధ్యార్థులు మాత్రమే పోటీ పడతారు. ఇతరుల విభాగంలో పాఠశాల విధ్యార్థులు కానివారు అందరూ వస్తారు. పోటీపడేవారు తమ తమ చిత్రాలను A4 సైజు తెల్లపేపరుపై చిత్రం గీసి, అదే పేపరుపై మీ పూర్తి అడ్రస్, సెల్ నెంబర్, పోటీపడే విభాగం తెలియచేయగలరు.మీ చిత్రాలు పంపుటకు చివరి తేది ఏప్రిల్ 27 ,2020.పోటీలో గెలుపొందిన వారికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత నిర్వహించే *జాతీయ పుడమి పురస్కారాలు..2020* అవార్డుల ఫంక్షన్ లో ముఖ్య అతిథులచే పుడమి పురస్కారాలు అందచేయబడును. మీ చిత్రాలను 9848242933 నెంబరు కు వాట్సప్ చేయగలరు. దయచేసి ఉపాధ్యాయ మిత్రులు తమ తమ విధ్యార్థులకు తెలియచేసి వారిని ప్రోత్సాహించాల్సినదిగా ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను. అలాగే మిత్రులందరూ మీ మీ వాట్సప్ గ్రూపులకు సమాచారం పంపగలరని నా మనవి.     మీ మిత్రుడు.... *చిలుముల బాల్ రెడ్డి* *అధ్యక్షులు-పుడమి సాహితీ వేదిక*


కామెంట్‌లు