సుమతీ శతకం ౨౩వ పద్యం. కరణము సాధై యున్నను కరి మద ముడిగి యున్నను బాము కరవక యున్నన్ ధర దేలు మీటకున్నన్ గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .. కరణము, గ్రామ లేఖకుడు, అతి మృదు స్వభావం కలిగివున్నా, బాగా బలిసి వున్న ఏనుగు ఘీంకారాలు చేయకుండా నెమ్మదిగా వున్నా, చక్కటి నల్లత్రాచు తన కాటువేసే గుణము చూపకున్నా, పెద్దది పదునైన కొండి వున్న తేలు కాటు వేయక పోయినా, చాలా వింతగా అనిపిస్తుంది. ఎవరూ వాటిని లెక్కచేయరు....... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *తండ్రి తన పిల్లలకు విషయాలు, పద్దతులు నేర్పేడప్పుడు కొంచెం కటువుగానే వ్యవహరించాలి. తల్లి తన లాలిత్యాన్ని చూపాలి. ఉద్యోగ ధర్మం పాటించే ఉద్యోగి దగ్గర యజమాని, యజమాని లాగే వ్యవహరించాలి. రక్షక భటులు అవసరమైన వేళ తమ లాఠీలు ఘుళిపించాలి. ఇలా ఎవరికి వారు వారి కర్తవ్యాన్ని నిర్మొహమాటంగా, నిర్ద్వందంగా నిర్వహించాలి. లేకపోతే, పరిస్థితులు తారుమారు అవుతాయి అని భావం.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు