సుమతీ శతకం ౩౧వ పద్యం. కులకాంత తోడ నెప్పుడుఁ గలహింపకు నట్టి తప్పు ఘటియింపకుమీ కలకంఠి కంట కన్నీ రొలకిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .. కుల సతితో/భార్యతో ఎన్నడూ తగవుకు దిగవద్దు. ఆమెపై లేనిపోని అనుమానాలతో నిందించ వద్దు. ఎందుకంటే, కలకంఠి/మంచి ఇల్లాలు కంటనీరు పెల్లుబికి ఏయింటిలో పడుతుందో, ఆ ఇంట లక్ష్మీదేవి ఉండదు అని లోకోక్తి .......... ....అని సుమతీ శతకకారుని వాక్కు. ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు