కరోనా టైం లో బర్త్ డే ఏంటన్నాను మా వాళ్ళతో.. నీకు అసలు బర్త్ డే చేసుకోవడం ఇష్టం ఉండదు కదా! కానీ "కరోనా " లాక్ డౌన్ గుర్తుగా నీవు మాతో బర్త్ డే చేసుకోవాలని పట్టుబట్టి ప్రత్యేకంగా ఇంట్లోనే మా ఆవిడ, పాప ఇద్దరూ కేక్ తయారు చేసారు. మా బాబు తానేం తక్కువ అనుకున్నాడేమో.. తాను ఫోట్వో లతో వీడియో తీసి నాన్నకు ప్రేమతో పాటతో.... మా బంధువుల గ్రూపుల్లో షేర్ చేసి అంతటితో ఆగక fb live... చేసి రచ్చ చేసాడు ఏదిఏమైనా వారి అభిమానాకి ఆనందపరవశుడైనాను. ఉదయం నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న బంధువులకు, మిత్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు సదామీ... సదాశ్రీ.


కామెంట్‌లు