అణ్ణాదురై మానవతావాది--తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అణ్ణాదురై ఇటలీ రాజధాని రోమ్ నగరాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన మత పెద్ద పోప్ ను కలిసేందుకోసం అనుమతి కోరారు. అణ్ణాదురైకి అయిదు నిముషాల సమయం కేటాయించారు. అహింసామర్తి గాంధీజీ పుట్టిన భారత దేశంలోని చిట్టచివరి రాష్ట్రమైన తమిళనాడు ముఖ్యమంత్రిని నేను అంటూ అణ్ణాదురై తమను పరిచయం చేసుకుంటూ తమిళుల గురించి చెప్తూ అయిదు నిముషాలలో తన ప్రసంగం ముగించారు. అయితే పోప్ అణ్ణాదురై మాట్లాడే తీరుకు ముగ్ధులై మాటలు కొనసాగించమన్నారు. అనంతరం అణ్ణాదురై యాభై అయిదు నిముషాలపాటు మాట్లాడారు. అణ్ణాదురై మాటలను ప్రశంసించిన పోప్ "మీకేం కావాలో చెప్పండి. మీకేదైనా ఇవ్వాలని ఉంది" అన్నారు."ఏది అడిగినా ఇస్తారా" అని అడిగారు అణ్ణాదురై."అడగండి. ఇస్తాను" అన్నారు పోప్."పోర్చుగల్ దేశం మా భారత దేశంలోని గోవాను ఆక్రమించింది.దీంతో పోర్చుగల్ కు వ్యతిరేకంగా పోరాడిన పద్మశ్రీ mohan ranade (1929లో సంగ్లీలో జన్మించారు - 2019లో పుణెలో కన్నుమూశారు) ఇప్పటికీ పోర్చుగల్ రాజధాని లిస్బన్ లోని చెరసాలలో బందీగా ఉన్నారు. ప్రపంచ క్రైస్తవుల పెద్దగా ఉన్న మీరు ఫోర్చుగల్ వారితో మాట్లాడి mohan ranade కు విముక్తి కల్పించాలి" అని కోరారు అణ్ణాదురై. అందుకు పోప్ అలాగే అని మాటిచ్చారు. ఆ మాటతో అణ్ణాదురై స్వదేశానికి మహదానందంతో తిరిగొచ్చారు.పోప్ జోక్యంతో ranade ( లిస్బన్ జైలులో పద్నాలుగేళ్ళు ఉన్నారు) ను విడుదల చేసి భారత దేశ దౌత్యాధికారికి అప్పగించారు. డిల్లీకి రావడంతోనే ranade కు స్వాగతం పలకడానికి అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధి విమానాశ్రయానికి వెళ్ళారు.Ranade ఇందిరాగాంధీకి నమస్కరించి ",ఎవరికోసమైతే పోరాడానో ఆ గోవా ప్రజలే నన్ను మరచిపోయిన స్థితిలో నా విడుదల కోసం తమిళనాడుకు చెందిన అణ్ణాదురైగారు నాకోసం ముందుకొచ్చారు. ఆయనను ముందుగా చూడాలి" అన్నారు. "అణ్ణాదురై మరణించారు. ఆయన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు నాంజిల్ మనోహరన్ నాతో వచ్చారు" అన్నారు ఇందిరాగాంధీ. వెంటనే ranade నాంజిల్ మనోహరన్ ని కలిసి నమస్కరించారు. Ranade ఎంతగానో ప్రేమించే గోవా వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు ఇందిరాగాంధీ.అప్పుడు ranade "నేను మొట్టమొదట వెళ్ళవలసింది గోవా కాదు. మొదటగా మద్రాసు వెళ్ళి అణ్ణాదురైగారి సమాధిని సందర్శించి అంజలి ఘటించాలి" అన్నారు.ఆ వెంటనే ఇందిరాగాంధీ ranadeను, నాంజిల్ మనోహర్ ని మద్రాసు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేశారు. Ranade నాంజిల్ తో కలిసి మద్రాస్ మెరీనాలో ఉన్న అణ్ణాదురై సమాధిని సందర్శించి బరువెక్కిన హృదయంతో బాష్పాంజలి చేశారు. పోప్ ను కలుసుకున్నప్పుడు తనకోసం ఏదీ కోరుకోని అణ్ణాదురై ఓ పోరాటయోధుడి విముక్తి కోసం మొరపెట్టుకున్న అణ్ణాదురై మానవత్వం ఎనలేనిదని ranade చెప్పారు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు