అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు-మే డే శ్రమ దీపం వలసవాదుల జీవనం నెత్తుటి నడకల నిర్వేదం ఆకలిదప్పుల పేదరికం అంతులేని నైరాశ్య జీవనం మేడలు మిద్దెలు కట్టే కార్మిక జనం మెతుకు దొరకక ముప్పతిప్పలు పడే వైనం అందరికీ బువ్వను పెట్టే కర్షక జనం అప్పుల ఊబిలో మునిగిన వైనం కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కావాలి వీరికై చేసిన చట్టాలు చుట్టాలవుకుండా చూడాలి అన్ని సేవలకు ధీటుగా గృహిణి సేవను అందరం గుర్తించుదాం తోడూ నీడై నిలుద్దాం మీరు వెలిగించే శ్రమ దీపం వెలుగవుతుంది నవ్యభారతం -సుధా మైత్రేయి 01.05.2020


కామెంట్‌లు