కరోనా పద్యాలు - ఉండ్రాళ్ళ రాజేశం 141) మాటలాడునపుడు నోటిన తుంపిర్లు మీదపడిన చాలు మేనునందు వచ్చి చేరునంట వ్యాధి కరోనంటు ఆకు కట్టుకునిరి అడవిబిడ్డ 142) ముప్పు పొంచినాది ముప్పయి వేలుగా భారతాన వ్యాధి పరుగులెడుతు భయము పంచుతుంది వాడలందు నిలిచి కదలబోకు నీకు గడపదాటి 143) కాకి చొక్కలేసి క్వారంటనందున అడ్డుగోడ వేసి యండగుండి రాకపోకలన్ని రద్దుతో పోలీసు రక్షగుండినారు రాజ్యమందు 144) అయినవారు లేక ఆన్ లైన్ ల పెండ్లీలు పిల్ల పిల్లగాండ్ల వీలులేక తాళి బొట్టు కట్టె దండిగా వాట్సప్ కు మూడుముళ్ళ లేక ముచ్చటాయె 145) చుట్టమంత లేక సందడి కరువాయి పదుల మందితోడ పండుగలును కూడి వెళ్ళలేక కూరాళ్ళు ఐరేండ్లు నడిసి వచ్చినాయి నలుగురందు 146) వలస ప్రజలు వెడల వారి రాష్ట్రంబుకు కేంద్ర మనుమతిచ్చి బద్రమనెను రాక పోకలందు రాష్ట్రాలు మార్గాలు తెరచుకున్నవన్ని వారికొరకు 147) కదలలేక జనులు కాళ్ళ నోప్పులు పుట్టె వుట్టి గుండలేక పంటి నముల ఇంటలోన మిగుల యింతి పోరు మొదలై లోల్లి పుట్టుతుండె మల్లిమల్లి 148) కవులు కలము పట్టి కవితలు రాయుచూ జనుల మార్చినారు జాగృతమున గొంతులెత్తినారు కూడిన గాయక మాధ్యమాలనందు మంచి తెలుప 149) పుట్టినట్టిరోజు పుత్తడి కొనలేదు మాట మరచినారు మదిన కేకు తీపి వంటకాల తియ్యని పిలుపులు అమ్మ నాన్నతోడ అవని మురిసె 150) తమిళనాట కూడ తాండవాన కరోన తరలుతుంది గాద తాండలందు అడ్డుగోడ పెట్టి ఆంధ్ర హద్దందున రాకపోక వలదు రద్దుయనిరి


కామెంట్‌లు