భక్తి ప్రపంచంలో కబీర్ దాస్ ఓ ఆణిముత్యం. ఇంతకూ కబీరుదాసు అంటే అర్థమేమిటీ అని తరచి చూడగా తెలిసింది"గొప్ప జ్ఞాని" అని. కాశీలో పుట్టి పెరిగిన కబీర్ తల్లిదండ్రులెవరో తెలీదు. కానీ ఆయనను ఓ నిరుపేద చేనేత ముస్లిం దంపతులు చేరదీసి పెంచారు. ఆ దంపతుల పేర్లు నీమా, నీరూ!కబీరుకి పెళ్ళవుతుంది. కానీ భార్య చనిపోతుంది. దాంతో మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. ఈ రెండో భార్య గయ్యాళి! ఆమెతో వేగలేక జీవితంపై విసిగిపోయిన కబీరు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అనేక ప్రదేశాలకు వెళ్తాడు. రకరకాల వ్యక్తులను కలుస్తాడు. కబీరు చదువుకున్న వాడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను శిష్యులు అక్షరరూపంలో భద్రపరుస్తారు. దాని పేరే "కబీరు బీజక్". రామానంద శిష్యుడిగా ఉండిన కబీర్ దాస్ రామభక్తుడు. గురువు ద్వారా పొందిన జ్ఞానోపదేశంతో తన జీవితాన్ని పావనం చేసుకుంంటాడు. కబీర్.కబీర్ దాస్ మరణించినప్పుడు ఆయన భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు తగువులాడుకుంంటారు. కబీర్ ముస్లిం అని, కాదు కాదు హిందువని వారు మధ్య ఘర్షణ జరుగుతుంది. కబీర్ భౌతికకాయం మాయమై అక్కడ పువ్వులు ఉంటాయి. దీంతో కబీరుని మహిమాన్వితుడిగా గుర్తిస్తారు. కబీర్ వంద గీతాలను విశ్వకవి రవీంద్రనొథ్ ఠాగూర్ తొలుత.బెంగాలీలో అనువదించారు. సూఫీ ఇజం, హిందూత్వ తత్వాల సమ్మిళితమే ఈ గీతాలన్నీ. తర్వాత ఠాగూరే ఈ కవితలను ఇంగ్లీషులో అనువదించగా ఈవ్లిన్ అండర్హిల్ పీఠిక రాయగా మెక్మిలన్ (న్యూయార్క్) ముద్రించింది. ఈ పుస్తకాన్నే పర్షియన్ భాషలో లెయిలా ఫర్జామీ అనువదించారు. 1915 లో ఠాగూర్ రాసిన "కబీర్ సాంగ్స్" పుస్తకానికి 79 ఏళ్ళ తర్వాత ప్రముఖ రచయిత చిక్కాల కృష్ణారావు గారు స్వేచ్ఛానువాదం చేసారు. ఈ గీతాలను ఆయన భగవాన్ రమణ మహర్షికి సమర్పించారు. కృష్ణారావుగారు 2015 డిసెంబర్ 30వ తేదీన తుదిశ్వాస విడిచిన విషాదకర సమాచారాన్ని నాకు అదేరోజు రాత్రి మిత్రురాలు మాధవీలతగారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. ఖలీల్ జిబ్రాన్ పుస్తకాలను ఆయన చేసిన అనువాద శైలి నన్నెంతో ఆకట్టుకున్నాయి. సుప్రసిద్ధ రచయిత చలంగారికి అత్యంత సన్నిహితులైన కృష్ణారావు గారు చేసిన అనువాదంలోంచి ఔ రెండింటిని చూద్దాం..... 1 పూలతోటలోకి వెళ్ళవద్దు ఓ సాధూ! అక్కడకు వెళ్ళకు. నీ దేహంలోనే పూలవనం వుంది. సహస్రదళ పద్మంపై ఆసీనుడవై అనంతమైన ఆ సౌందర్యాన్ని వీక్షించు. 2 మనం ఎప్పటికీ దేనినైతే చూడలేమో, దాన్ని పరబ్రహ్మ సృష్టి రూపంలోకి తీసుకొచ్చి అసలు తానేమిటో వ్యక్తమౌతాడు. మొక్కలో విత్తనం చెట్టులో నీడ ఆకాశంలో శూన్యం ఆ శూన్యంలో అనంత రూపాలు వున్నట్లు నిరక్షరుని నుంచి అక్షరుడు ఆ అక్షరుని నుంచి క్షరుడు విస్తరించాడు. పరమేశ్వరునిలో జీవుడు జీవునిలో పరబ్రహ్మ ఉన్నారు. వారు విడిగా వున్నా ఎప్పుడూ కలిసే వుంటారు. ఆయనే వృక్షం, అంకురం. ఆయనే పుష్పం, ఫలం, చాయ. ఆయనే ఆదిత్యుడు, కాంతి, ప్రకాశం. ఆయనే పరబ్రహ్మ, జీవుడు, మాయ. ఆయనే ప్రాణం, శబ్దం, అర్థం. ఆయనే మితం అమితం ఆయన ఆ రెండింటికీ అతీతంగా శుద్ధ బ్రహ్మగా వున్నారు. బ్రహ్మలో జీవునిలో ఆయన శుద్ధ మనసుగా వున్నారు. ఆత్మలో పరమాత్మ, పరమాత్మలో బిందువు, బిందువులో ప్రతిబింబం దర్శనమౌతుంది. ఆ దివ్య దృశ్యాన్ని దర్శించిన కబీరు ధన్యుడు. ఇవి చిక్కాలవారి అనంవాద సరళి. - నేనూ ఓ నాలుగైదు అనువదించాను. కానీ కృష్ణారావుగారి రచన చదివిన తర్వాత నేనిక ముందుకు వెళ్ళలేకపోయాను. పైగా ఇంగ్లీషుకూడా అంతంత మాత్రమే రావడంవల్ల పూర్తి అనువాదానికి సాహసించలేకపోయాను. నేను చేసిన అనువాదాలలో మచ్ఛుకి ఓ రెండు ఇక్కడ ఇచ్చాను..... 1 ఓ సేవకుడా! నన్నెక్కడ చూడాలనుకుంటున్నావు నేను నీ పక్కనే ఉన్నాను. నేను ఆలయంలో లేను. మసీదులో లేను. కైలాసంలోనూ లేను. నేను సంప్రదాయాలలోనో లేక సంస్కారాలలోనో లేక యోగంలోనో లేను. నిజంగా నాకోసం అన్వేషిస్తున్నవా అలాగైతే నన్ను ఏదో ఒక క్షణంలో తప్పక కలుస్తావు! కబీరు అంటున్నాడు కదా, ఓ సాధువా! జీవులందరికీ ఆ భగవంతుడే జీవుడై ఉన్నాడు!! 2 ఓ సాధువుని నీ కులమేమిటని అడగటం అనవసరం. మతాచార్యుడైనా సైనికుడైనా వ్యాపారి అయినా ఇలా ఎవరైనా ఒక్క తీరులోనే ఆ పరమేశ్వరుడికోసం అన్వేషిస్తారు! కనుక సాధువుని నీ కులమేమిటని అడగటం పనికిరాని పని. క్షురకుడికీ ఆ దేవుడే కావాలి. రజకుడికీ ఆ దేవుడే కావాలి. కంసాలికీ ఆ దేవుడే కావాలి. ఇలా ప్రతి ఒక్కరూ ఆ దేవుడి కోసం అన్వేషించిన వారే! హిందువులైనా ముసల్మానులైనా అంతిమంగా ఒకే రీతిలో ఆ దేవుడి పాద సన్నిధికి చేరారు!! - యామిజాల జగదీశ్
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. . **** . *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి.
• T. VEDANTA SURY
భళిరే నైరా
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి