చిరు ఆశల హరివిల్లు (బాలల కవితా సంకలనం) -------------------------- మొలక పాఠకులందరికీ నమస్సులు! ఈమధ్య బాల సాహిత్యానికి చాలా ఆదరణ పెరుగుతోంది..ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఉపాధ్యాయులు బాలలకు పాఠ్య పుస్తకాలతో పాటు వారిలో పఠనాసక్తి ని పెంచి సృజనాత్మకత ను వెలికి తీసే ప్రయత్నం చేయడమనేది చాలా మంచి పరిణామం. ఎప్పుడో ఐదేళ్ల క్రితమే తాను పని చేస్తున్న పాఠశాల విద్యార్థుల్లో సాహిత్య అభిలాష రేకెత్తించి, వారితో అద్భుతమైన కవిత్వం రాయించడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఉపాధ్యాయినే వురిమళ్ల సునంద. ఆమె ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలం కలకోట ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయిని గా పనిచేస్తూ ఉన్నారు. తను 2015 లో ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం లో పని చేస్తున్న సమయంలో ఆరు, ఏడు, ఎనిమిది విద్యార్థులకు మాతృ భాష తెలుగు పట్ల ఆసక్తి కలిగించి .. వారికి చిన్న చిన్న దత్తపదులు ఇచ్చి నాలుగైదు లైన్లలో కవితలు రాయించడం ఆశ్చర్యంగా అనిపించింది.. అప్పట్లో పాకిస్థాన్ లోని పెషావర్ లో 240కి పైగా ఉగ్రవాదులు భయంకరంగా కాల్చి చంపిన ఘటన పత్రికల్లో చదివి చలించి రాసిన విద్యార్థుల కవితలు చూస్తుంటే.. వారి సామాజిక అవగాహనకు మెచ్చుకోకుండా ఉండలేం.. ఇలా వారి కవితలతో" "చిరు ఆశల హరివిల్లు'' బాలల సంకలనం తీయడం చాలా గ్రేట్.. ఇందులో సుమారుగా పదిహేను మంది విద్యార్థులు 38 కవితలు రాశారు.. ఇందులో అమ్మ గురించి, నీటి పొదుపు గురించి, చెరువు, చెట్టు, స్నేహం..ఇలా ఎన్నో అంశాలను తీసుకుని కవితలు రాశారు.. ఇంటికి దీపం అమ్మ అని శ్రావణి అనే అమ్మాయి , చెరువు వారి పాలిట కల్పతరువవని కన్నోజు శ్రావణి, నాన్న నా భరోసా అని వినీత... పెషావర్ సంఘటన పై సరస్వతి... ఇలా పిల్లలు రాసిన కవితలు చదువుతుంటే భవిష్యత్తులో గొప్ప కవులు అవుతారనే నమ్మకం కలుగుతుంది.. ఇంత మంచి కవిత్వం రాయడానికి కారణమైన ఉపాధ్యాయిని సునంద గారికి . గురువు గారి మాట విని చక్కటి కవితలు రాసిన విద్యార్థులకు అభినందనలు.... ఈ పుస్తకం వేయడానికి దాతలు ఎవరు లేరు.సునంద స్వంత ఖర్చులతో వేయించిన పుస్తకం.. వెల :అమూల్యం.. ప్రతులకు.. వురిమళ్ల సునంద ,ఖమ్మం 'సాహితీ లోగిలి', 11-10-694/5, బురహాన పురం, ఖమ్మం 507001 చరవాణి-9441815722


కామెంట్‌లు