అల్లరి కుర్రవాడిని పాఠశాల నుండి టీ. సీ ఇచ్చివేసి పంపడం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎవరి పనులు వారు చేసుకుపోయేవారు. విద్యార్థులు, టీచర్స్ కూర్చోడానికి బెంచీలు కుర్చీలుగానీ లేవు . చాలా ఇబ్బంది పడేవారు. ఎం. ఎల్. ఏ గారికి 300 రూపాయలు విలువ చేసే ఒక్క కుర్చీ అయినా పాఠశాలకు అందజేయమని కోరాం. అలాగే అన్నారు. కానీ ఇంతలో పాఠశాల భవన నిర్మాణానికి ఐరన్ పిల్లర్ చేయించి ఆ భవన పునాది స్థలంలో ఉంచారు. రెండో రోజున సిమెంటు కలిపిన పిక్కరాయి పోసి పిల్లర్ ను నిల బెడదామను కున్నారు. కానీ ఆ రాత్రి కొందరు దొంగలు వచ్చి ఆ ఐరన్ చట్రాన్ని తీసుకుపోయారు. ఇది నీచాతినీచమైన సంఘ విద్రోహుల పనేయని ఎం.ఎల్. ఏ గారు గుర్తించారు.తను స్కూల్ అభివృద్ధికోసం కృషి చేస్తుంటే సంఘవిద్రోహులు చేసే పని ఇది. ఎం.ఎల్. ఏ గారు పాఠశాలకు ఇస్తామన్నకుర్చీ ఇవ్వలేదు..విద్యాకమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు ఎం.ఎల్. ఏ గారి మార్గాన్నే అనుసరించారు. ఏం చేయాలో అర్థం కాలేదు. స్టాఫ్ మీటింగ్ కండక్టు చేసాను. ఆఫీసు రికార్డులు ఉంచేందుకు బీరువా అత్యంత అవసరంఅయింది. అలాగే కుర్చీలు కూడా అవుసరమైనవే ! బలిజి పేట హైస్కూలులో పనిచేసినప్పుడు జన్మభూమి కార్య క్రమంలో పాఠశాలకు కావలసిన అవసరాలను ప్రజల నుండి తీర్చుకోవడం జరిగింది. ప్రజలంతా ముందుకు వచ్చి సహకరించారు. బలిజిపేటకు ఉన్న ఫీడింగ్ విలేజెస్ పక్కికి లేవు. పక్కి స్కూలులో ఉన్న 300 పైబడిన విద్యార్థులు పక్కి గ్రామానికి చెందిన విద్యార్ధులు, హోస్టల్ లో నివసిస్తున్న విద్యార్థులు ( పై గ్రామాలకు చెందినవారు ) మాత్రమే ఉండేవారు. ఆ కారణంగా పాఠశాల అభివృద్ధికి గ్రామంలో ఎవరు సహకరిస్తారో లేదో తెలియదు. ఎం.ఎల్. ఏ గారు విద్యాకమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు కుర్చీలు సమకూర్చడానికి ఇచ్చిన మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతు న్నారంటే ఏమనుకోవాలో అర్ధం కాలేదు. వారు అలా చేసి నందుకు నేను చాలా బాధ పడ్డాను. దీనికి కారణమేదో ఉండి ఉండాలి. సైన్స్ మాష్టారు, ఒక సెకండరీ గ్రేడ్ మాష్టారుమాత్రమే ఊరులోనివసించేవారు. మిగిలిన వారంతా షటిల్ సర్వీసు చేస్తున్నవారే !ఎవరు ఉదారంగా ఉండి పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తారన్న విషయం ఆ ఇద్దరికీ మినహా ఎవరికీ తెలియదు. అంచేత ఊరులో ఎవరిని కలుస్తారో, ఏం చేస్తారోగానీ వారినే చెయ్యమన్నాను. మూడు, నాలుగు రోజులు కృషిచేసి దాతలను కనుగొని వెంటనే వారిచే బీరువాను, కుర్చీలను కొనిపించి పాఠశాలకు చేర్పించారు. చివరకు అనుకున్నది సాధించాము. పట్టుదల ఉంటే తప్పనిసరిగా విజయం సాధించగలమని దీని ద్వారా నిరూపణ అయింది. ( సశేషం )-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,- ఫోన్: 7013660252.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి