రీజనల్ జోయింట్ డైరెక్టర్ ( ఆర్. జె.డీ ) ఆఫ్ ఎడ్యుకేషన్, కాకినాడ గారి సర్క్యులర్ మేరకు నేను ట్రాన్ఫర్ కోసం ధరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఫలానా రోజున ట్రాన్ఫర్స్ టేకప్ చేస్తున్నామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న రెండే రెండు పోస్ట్ లు ఖాళీలవుతాయని విన్నాను. అవి బొబ్బిలి లోకల్ గరల్స్ హైస్కూలు మరియూ బొబ్బిలికి పదిహేను కిలోమీటర్ల దూరంలో నున్న సీతానగ రం హైస్కూళ్ళ లో హెడ్మాష్టరు పోష్టులు ఖాళీలవుతాయని. ఆ రెండింటికీ విపరీతమైన కాంపిటీషన్ ఉందని విన్నాను. ట్రాన్ఫర్స్ కౌన్సెలింగ్ లో ఎవరికెన్ని పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్ ను బట్టి ట్రాన్ఫర్స్ చేస్తారు. పాయింట్స్ ఎలానిర్ణయిస్తారంటే ఒక ఉపాధ్యాయుడు ఒక ప్రదేశంలో ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు ? లాంగ్ స్టాడింగ్ అయితే ఎక్కువ పాయింట్స్ వస్తాయి.భార్యాభర్తలు ఇద్దరూఉద్యోగు లైతే వారికి స్పౌజ్ కోటాలో కొన్ని పాయింట్స్ ఇస్తారు. అలానే తను పనిచేసే పాఠశాలకు వచ్చిన పరీక్షా ఫలితాలు అధికంగా ఉన్నట్టయితే మరి కొన్ని పాయింట్స్ ఇస్తారు. ఉపాధ్యాయ సంఘనాయకునిగా ఉంటే, ఆ సంఘం రికగ్నిషన్ ను కలిగిఉంటే పది పాయింట్స్ ఇస్తారు. అయితే నేను పక్కిలో ఉన్నది రెండు సంవత్సరాలు మాత్రమే ! లాంగ్ స్టాడింగ్ కానేకాదు. మా భార్యాభర్తలు ఇద్దరిలో నేను ఒక్క డినే ఉద్యోగం చేస్తున్నాను. అంచేత స్పౌజ్ కోటాలో నాకు పాయింట్స్ వచ్చే అవకాశమే లేదు. ఇక పాఠశాల పదవ తరగతి పబ్లీక్ పరీక్షాఫలితాలంటే కనీసం 40% దాటలేదు. సంఘనాయకునిగా ( రికగ్నైజ్డ్ అసోసియేషన్ జిల్లా ప్రెసి డెంటుగా గానీ జిల్లా జనరల్ శక్రటరీగా గానీ) ఉంటే 10 పాయింట్లు ఇస్తారు. కానీ గత సంవత్సరం ఎన్నికల్లో ఏ. పి. హెడ్మాష్టర్స్ అసోసియేషన్ జిల్లా అద్యక్షునిగా ఎన్నుకుంటా మంటే నేను అంగీకరించ లేదు. ఇప్పుడు ఆ పదవి అవుస రమే వచ్చింది.ఇలా ఏ విధంగా చూసినా నాకు కలసిరాలేదు.మరి పక్కి నుండి కదిలే ప్రసక్తే లేదనే నిర్ణయించుకున్నాను అయినా బదిలీకి దరఖాస్తు మాత్రం చేసేసాను. ఇద్దరు ముగ్గురు స్నేహితులతో నా ట్రాన్స్ఫర్ గురించి చర్చించాను. వారి నుండి పొందిన సమాచారం ప్రకారం సీతానగరం హైస్కూల్ కు గుమ్మలక్ష్మీపురం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న ఒకాయన హెచ్.ఎం గా స్పౌజ్ కోటాలో రావాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలానే బొబ్బిలి గరల్స్ హైస్కూలుకు ఇద్దరు, ముగ్గురు హెడ్మిష్ర్టస్ లు రావడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇక మిగిలిందల్లా గుమ్మలక్ష్మీపురం మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఖాళీ చేస్తున్న పోస్ట్ మాత్రం మిగిలి ఉంది. అది నేను నివసిస్తున్న ప్రదేశం బొబ్బిలికి 70,80 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టవు తుందనుకున్నాను.పట్టణవాతావరణంలోనున్నవాడిని గిరిజనప్రదేశాల వాతావరణంలోకి వెళ్ళాలి. హైస్కూల్ హెడ్మాష్టరుగా పనిచేసుకున్నంత సుఖం, ప్రశాంతత ఎం. ఇ. వో గా రాదు. అంతా. టెన్షన్ టెన్షన్ గా జీవితం గడుస్తుంది. ఎం. ఇ.వో పోస్ట్, హెడ్మాష్టరు పోస్ట్ రెండూ సమాన హోదా, సమాన వేతనం గలవి. ఎం.ఇ.వో పోష్టుకు బాధ్యతలెక్కువ. ఉన్నతాధికారులనుండి చీవాట్లూ ఎక్కువే ! అవినీతి కూడాఎక్కువే ! నాలాంటివాడు అసలు ఆ పోస్టులో ఇమడలేడు. హెడ్మాష్టరుగా పనిచేస్తే ఉన్నతా ధికారుల తాకిడి ఉండదు. కష్టపడి పాఠం చెప్పుకుంటే నలుగురు పిల్లలను బాగుచేసు కోవచ్చు. ప్రజలలో గౌరవంఉంటుంది. ఒకనాడు ఇంగ్లండ్ లో గల ' రగ్బీ స్కూల్ ' లో పనిచేసిన హెడ్మాష్టరు థామస్ ఆర్నాల్డ్ జ్ఞప్తికి వస్తారు. హెడ్మాష్టరు పోస్ట్ అంటే అత్యంత విలువలతో కూడుకున్నది.హెడ్మాష్టరు అంటే పిల్లలలో ఎనలేని గౌరవం, ప్రేమ, ఆత్మీ యత, ఆప్యాయత, అనురాగం అనుబంధాలు అనంతమైనవిగా ఉంటాయి. అవి మనిషిని, మనసును ఎక్కడికో తీసుకుపోతాయి. వాళ్ళు పెరిగి, పెద్దవారై, ప్రయోజకులైతే ఎక్కడ కనిపించినా వారు చూపించే ఆదరణ, అభిమానం అనన్యమైనవి. ఇటీవల నేను ఆత్మకథ వ్రాస్థున్నప్పుడు ముగ్గురు , నలుగురు విద్యార్థులు ఫోన్ చేసి నాదగ్గర టెక్కలిలో 1972-75 సంవత్సరాలమధ్య కాలంలోనూ, బలిజిపేటలో 1977- 97 మధ్య కాలంలో వాళ్ళు నా దగ్గర చదువుకున్నట్టుగ ఆనాటి స్కూలు జ్ఞాపకాలను ఈనాడు నెమరు వేసారు. ఒక అబ్బాయి అయితే తన చిన్ననాటి ఆర్థిక పరిస్థితులలో నేను చేసిన సహాయాన్ని తలచుకొని ఏడ్చేసాడు. మరొకడు తను తన భార్య లాయర్లగా సెటిలయ్యామన్నారు. అలా చెబుతున్నప్పడు చాలా ఆనందం అనిపించింది. ఈ పరిస్థి తులను చూసి బొబ్బిలి, సీతానగరం హైస్కూళ్ళపై ఆశలు వదులుకున్నాయి. మళ్ళీ పక్కి హైస్కూలులో ఉండక తప్పదనే నిర్ణయానికొచ్చాను. కాకినాడలో గల కౌన్సిలింగ్ కు వెళ్ళకూడదనే నిర్ణయానికొచ్చి విరమించుకున్నాను. మనసు లో నుండి ఆ తలంపును తొలగించుకున్నాను. మూడురోజులు గడచిపోయాయి. నా స్నేహితుడు, బి.ఇ.డీలో నా క్లాస్-మేట్, బలిజిపేట హైస్కూలులో నా సహచరుడు అయిన బాలనాథం ' బూర్జ ' హైస్కూలులో హెడ్మాష్టరుగా పని చేస్తుండేవాడు. బూర్జకు చాలా దగ్గర అడ్డు మార్గం 7 కిలో మీటర్ల ఉంటుంది. ఇటు,అటు కలిసి 14 కిలోమీటర్లు ఉండొచ్చు. ఈ మార్గం గుండా స్కూలుకు నడిచి వెళ్ళొచ్చు. అలానే బస్సుమార్గం కూడా ఉంది. బలిజిపేట, నుండి 25కిలోమీటర్లు బొబ్బిలి వచ్చి అక్కడ నుండి మరో 25 కిలోమీటర్లు బూర్జ వెళ్ళవలసి ఉంటుంది. మొత్తం పై 50 కిలోమీటర్లు ఒక ప్రక్క. ఇక రెండు వైపులా 100 కిలో మీటర్లు ఉంటుంది. ఆకారణంగా నేను పక్కి పోస్ట్ ఖాళీ చేస్తే నా పోస్ట్ కు అతను ట్రాన్ఫర్ పై రావాలని ప్రయత్నిస్తున్నాడు.కానీ ప్రస్తుత పరిస్థితులలో తన ఆలోచన సాధ్యం కానిది. ( సశేషం )--శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. . **** . *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
• T. VEDANTA SURY
మహాభారతంలో ధర్మరాజుకు వాడిన పేర్లు.: -డా.బెల్లంకొండనాగేశ్వరరావు.
• T. VEDANTA SURY
భళిరే నైరా
• T. VEDANTA SURY
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి