మానేరు ముచ్చట్లు---మండలం రోజులయ్యింది ముచ్చట్లు మొదలు పెట్టి.నేను రాసిన ముచ్చట్లకు స్పందన చూస్తుంటే శతదినోత్సవం దాకా రాయాలనిపిస్తుంది.రాయొచ్చు.అవి ఒడువని ముచ్చట్లే.అయితే ఇంకా కొన్ని మాత్రమే ముఖ్య సంఘట నలు వివరించి ఆపై మధ్యలో ఆపిన చారిత్రకాంశాల్ని వివరిస్తాను. కాకతీయుల తరువాత,కొద్ది కాలం ముసునూర నాయకులు,ఆ పై బహమనీలు కుతుబ్షాహీలు, మొగలా యీలు,ఆసఫ్జాలు అలా చివరి నిజా ము పాలన వరకు రాయల్సి ఉంది.అదంతా యాభయ్యవ భాగం లోపల ముగించి,ఆపై మిగతా అనుభవాలుతెలియజేస్తాను.ముఖ్యంగా ఆ భాగంలో నాకు పరిచయమైన ప్రతి వ్యక్తినీ పరిచయం చేయాలని ఉంది. నా ముచ్చట్లకు ప్రతిస్పందిస్తూ నన్ను ప్రోత్సహిస్తూన్న చిన్నా పెద్దా అందరికీ కృతజ్ఞతా పూర్వక వందనములు. ---- కొండను అద్దంలో చూపించటమన్నా సాధ్యమేనన కాని, హిమాలయ పర్వతాన్ని అద్దంలో చూపించటం అసాధ్యం.అలాగే పార్థసారథ గారి క్రియాశీలత బహు ముఖీన మైంది. ఎంత స్థాలీపులాక న్యాయంగా చెబుదామన్నా,అది ఏ ఒక్క విషయానికే సరిపోతుంది.పది రకాల పదార్థాలు తయారు చేసిన ప్పుడు పది పదార్థాల మచ్చు చూపించకపోతే ఎలా?ఆ తరువాత మళ్లీ ప్రస్తావన కుదరక పోవచ్చనే దృష్టితో ఈ కొనసాగింపు. ఆడపిల్లలకు చదువెందుకనే ఆలోచన నుండి అప్పుడప్పుడే పెద్దవాళ్ల మనసులు మారుతున్న రోజులవి.అదీ రాస్తే కూస్తో చదువు కున్న కుటుంబాల పిల్లలు మాత్రమే బడిలో చేరే రోజులు.తరగతి గదిలో నలభైమంది మగపిల్లలుంటే ఇద్దరో ముగ్గురో ఆడపిల్లలుండేవారు. పంతులమ్మలు కూడా చాలా తక్కువమంది అదీ చిన్నబళ్లలో మాత్రమే. ఆడపిల్లల చదువు ఆవశ్యకతను గుర్తించిన పార్థసారథిగారు,ఏ భయంతో తల్లిదండ్రులు ఆడ పిల్లలను బడికి పంపించరో తెలుసుగనుక వారికోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి ఎంతో ఆత్మ స్థైర్యాన్ని కల్పించారు. వారికోసం గర్ల్స రూం ఏర్పాటు చేయించారు.సాంకేతిక విద్యలో భాగంగా కుట్టు మిషన్లు వచ్చేట్టు చేశారు.వారికి క్రీడాపోటీలు, అల్లికలు,ముగ్గులు.ఆటలు,పాటలువంటివి ఏర్పాటు చేయించి ఎంతో ఉత్సాహంగా పాల్గొనేట్లు చేశారు. సాధారణంగా ఏ పాఠశాలలో నైనా అన్ని రకాల పోటీలుంటాయి కాని ఈతపోటీలుండటం అరుదు.అలాంటిది బడికి కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెరువులో ఈతల పోటీలు ఏర్పాటు చేశారు.అందులో అమ్మాయిలకు కూడా ఏర్పాటు చేస్తే నా క్లాసుమేటు కృష్ణాబాయి ప్రథమ బహుమతి పొందటం నాకింకా బాగా గుర్తు.ఆమె ఆర్మ చందన్న సారు సోదరి.చందన్న సారు బాపుకు మంచి మిత్రుడు.వాళ్లింటికి ఎదురుగానే రాజుగారి బావి ఉండటం ఆమెకు చిన్నప్పటినుండే ఈత రావటం పరిసరాలు కల్పించిన అవకాశం. ప్రతి సంవత్సరం రెండు జండా పండుగలకు కాగితపు జండాలు అతికించి తోరణాలు చేయటం గమనించి,కుట్టు నేర్చుకున్న ఆడ పిల్లలతో రంగు రంగుల బట్ట జండాలు కుట్టించి భద్రపరచారు.అప్పట్లో వాగవతలి ఊళ్లనుంచి వచ్చి ఇల్లు కిరాయకు తీసుకుని చదివిన ఆడపిల్లలున్నరు.అలా వచ్చిన వారిలో పొత్తూరు నర్సుబాయి,ఇంద్రాణి,అరుణ మొదలైన వారున్నారు.అప్పట్లో మాకు పెద్ద క్రాఫ్ట్ట్ రూం ఉండేది.జూపాక లింగయ్య సారు మాకు క్రాఫ్ట్ టీచరు.ఆయన క్షణం తీరిక లేకుండా క్రాఫ్ట్ పని అంటే వడ్రంగి పనిముట్లతో చెక్క పని నేర్చుకోవడం, నోటుబుక్కులు తయారు చేయడం, జంతువుల కొమ్ములతో దువ్వెనలు తయారు చేయడం నేర్పించారు.అంతే కాకుండా స్కూలుబోర్డు కోసం ఆయన ప్రత్యేకంగా అక్షరాలు చెక్కలతో తయారు చేసారు.ఆ అక్షరాలన్నీ బోర్డు మీద బిగించి పాఠశాల ముందు తగిలించిన రోజు ఆ ముసలి సారు విజయగర్వంతో వికసించిన ముఖంనేను చూశాను. ఆ బోర్డు ఇప్పటికీ అలాగే ఉంది శిథిల శిల్పంలాగా. మా అప్పుడేబళ్లలో N.C.C. ప్రవేశ పెట్టారు.దానికి ఆర్ .వెంకటయ్య సారును శిక్షణకు పంపించి పిల్లలకు శిక్షణ ఇప్పించారు.ఆ సారుది ప్రక్కనే ఉన్న బద్దిపెల్లి. ప్రస్తుతం వానప్రస్థంలో ఉన్నారు వారి ఊళ్లోనే.గోపాల స్వామి స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇంఛార్జి.స్కూల్లో మంచి గ్రంథాల యం ఉండేది.దానికి సీనియర్ గ్రేడ్ తెలుగు పండిత్ రామ మూర్తి సారు ఇంఛార్జ్.ఇక సైన్సు ప్రయో గశాల బాధ్యత లక్శ్మీరాజం సారుది. ఆయనఅప్పట్లో సైన్సు ప్రయోగాలు అన్నీ చేసిచూపించారు.పదకొండవ తరగతిలోకప్ప డిసెక్షన్ ప్రతి సంవత్సరం తప్పని సరి.లక్ష్మిరాజం సారు గురించి చెప్పా లంటే ఒకే ఒక్క మాటలో, పార్థసారథి సారు తరువాత ఆయన బాటలో చివ రిదాకా పయనించిన మరో విశిష్ట వ్యక్తి. బొమ్మన లింగయ్య సారు సోషల్సర్వీస్ ఇంఛార్జ్. మిగతా ఉపాధ్యాయు లకు కూడా ఒకరికి క్రమశిక్షణ,ఒకరికి పాటలు నేర్పించ టం(వెంకటప్పయ్య), ఒకరికి ప్రార్థన నిర్వహించడం (వాహె దలీ), ఒకరికి నోటీసు బోర్డు మీద సూక్తులు రాయటం (ఆర్టిస్టు ఐలయ్య) ఇలా ప్రతి ఉపాధ్యాయునికీ వారి అభిరుచి మేరకు ,పనులు కేటాయించి పాఠశాలను తీర్చిదిద్దిన మానవతా శిల్పి. ఆయనను ఇప్పటికీ తలచుకునే ఎందరో శిష్యులు ఉన్నారు.మాఊరిలో తొలి ఇంజనీయరు మంచికట్ల రామ స్వామి అయితే తొలి డాక్టరు ఆయన సోదరుడు డా.మంచికట్ల జనార్దన్ గారు.ఒకే కుటుంబం నుంచి తొలి ఇంజనీయరు,తొలి డాక్టర్ రావడం విశేషం.రామస్వామి గారు కొంతకాలం L.M.D.లో చేసి హైదరాబాదులో స్థిరపడ్డారనిమాత్రమే తెలుసు. ఢా.జనార్దన్ గారు ఇప్పటికీ పార్థసారథి గారినీ అలాగే బాపును తలచుకుంటా రు.ఆయన వివాహం బాపే జరిపించా రట. తండ్రికి క్యాన్సర్లువచ్చి భరించలేని బాధ పడుతూచివరి దశలో పలకమీద డాక్టరు కావాలని జనార్దన్ గారికి ఆదేశిస్తే పట్టుదలతో డాక్టరై ముఖ్యంగ క్యాన్సరు ట్రీటుమెంటు స్పెషలిస్టుగావరంగల్ యం.జి.సం.లో రిటైరైన తరువాత కూడా ఏడేళ్లు సేవ చేసిప్రస్తుతం విశ్రాంతి జీవనం గడుపుతున్నారు.మాకు చిన్న బడిలో చదువు చెప్పిన పాక రాజన్న సారుకొడుకు కూడచిన్న పిల్లల డాక్టరుగా కరీంనగర్ లో సేవలందిస్తున్నాడు. మేము కొంతకాలం కుటుంబ పరిస్థితుల దృష్ట్యా గాలిరామయ్య గారింట్లో కిరాయకున్నాము.ఆయన సంతానం అంతా విద్యావంతులే. పెద్దకొడుకు అనంతం గారు పిడబ్ల్యూడిలో ,రెండో కొడుకు నరహరి యూని యన్ బ్యాంక్ మేనేజర్ గా, మూడో అతను నా క్లాసుమేట్ సత్యనారా యణ గవర్నమెంటు డాక్టరుగ, నాలుగో అతను గోదావరిఖనిలో ఉద్యోగాల చేసి అందరూ విశ్రాంతిపర్వంలో ఉన్నారు.వారింట్లో ఉన్పప్పుడే తొలి తెలంగాణ బి.సి. కమి షన్ ఛైర్మన్ బి.యస్..రాములు గారితో పరిచయం.అదే ఇంట్లో వారొకవైపు మే మొకవైపు ఉండే వాళ్లం.అందుకే ఇప్ప టికీ అదే ఆప్యాయత,అదే ప్రేమపూర్వ. కమైన పలుకరింపు.ఆయన అప్పట్లో హాస్టల్వార్డెన్ గా ఉండే వారు.వారికి ఎలగందుల విషయాలు చాలా తెలుసు. జంగంభద్రయ్య గారని మా ఊళ్లో ఓకే ఒక జంగం వాళ్ల కుటుంబం ఉండే ది.వాళ్ల అబ్బాయి కూడా డాక్టరని విన్నా ను. దాదాపు వీళ్లలో ఒకరిద్దరు తప్ప చా లా మంది పారథసారథిగారి హయాంల చదివిన వారే.ఇక మిగిలిన వారిలోచాలా మంది టీచర్లుగ లెక్చరర్లుగా మంచి పేరు తెచ్చుకున్న వారున్నారు మా తమ్ముళ్లు డా.లక్ష్మన్ రావు, డా. శరత్ బాబు ఇద్దరూ లెక్చరర్లే. డా. వుడుతల సురేం దర్ ఫిజిక్స్ లెక్చరర్, డా.చీటి ప్రకాశ్ రావు వీళ్లు నాకు తెలి సిన వాళ్లు.తెలియని వారు చాలా మంది ఉన్నారని నాకు తెలుసు. వీళ్లందరూ పార్థసారథిసారు వెలిగించిన వెలిగందల దీపాలే.-రామ్మోహన్ రావు తుమ్మూరి .


కామెంట్‌లు