సుమతీ శతకం ౩౯వ పద్యం. తన కోపమే తన శతృవు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌఁ తన సంతోషమె స్వర్గము తన దఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ! తా : ఓ మంచి తెలివి గల బుద్ధిమంతుడవైన, సుమతీ .... (ఇది వివరణ అవసరము లేని, మనం చిన్నప్పుడు కంఠతః చేసిన పద్యం. అయినా, ప్రయత్నం చేస్తాను) ఎవ్వరికైనా వారి కోపమే వారి శతృవు. ప్రశాంతతను అలవాటు చేసుకోగలిగితే ఆ శాంతమే మనకు రక్షగా వుంటుంది. ఎదుటి వారియందు దయతో వుంటే ఆదయయే మనకు చుట్టం అవుతుంది. ఏ పరిస్థితి లో నైనా సంతోషాన్ని అనుభవించ గలిగితే అంతకంటే స్వర్గం వుండదు. మన దుఃఖమే మనకు నరకమమును తెచ్చి పెడుతుంది........... ....అని సుమతీ శతకకారుని వాక్కు. *కోపము, శాతం, స్వర్గం, నరకము ఇవి అన్ని కూడా మనకు మనం ఏర్పరుచుకున్న భావాలు. ఇవి ఏర్పడ డానికి కారణం ఎదుటివారి నుంచి మనం ఏదో ఒకటి ఆశించడం. అంటే, మన మాట వారు వినాలని, చెప్పినట్టు వారు చెయ్యాలని అనుకోవడం వల్ల వచ్చేవి. ముఖ్యంగా ఇవన్నీ మనవాళ్ళు అని మనం అనుకే వాళ్ళ దగ్గర నుండి ఎక్కవగా ఆశిస్తాము. జరగనప్పుడు దుఃఖ పడతాము. అనుకున్నది జరిగినప్పుడు సంతోష పడతాము. ఇవి అన్నీ కూడా, మనం అనుకోవడం, ఎదుటివారి నుంచి ఎదో ఆశించడం వల్ల కలిగే భావాలు.* *అన్నిటికి మందు, నిరాసక్తత, నిస్వార్థ చింతన, సేవ. ఇది అంత తేలికగా వచ్చే స్తాయి కాదు. ఎంతో శ్రమ, ప్రయత్నం, భగవద్భక్తి కలిస్తే తప్ప ఈ స్తాయి పొందలేము.* ....ఓం నమో వేంకటేశాయ Nagarajakumar.mvss


కామెంట్‌లు