ఓ కరోనా..... ( కవిత ) పిలువని పేరంటానికి వచ్చావే ఓ కరోనా ! ప్రజలనoతా నీ గుప్పిట్లో బందిచావే ఈ జగానా !! కర్షకులు, కార్మికులు కష్టాలు పడుతుంటే కనికరం లేకుండా నే కరోనా నoటావా? కాలాన్ని వృధా చేస్తూ కనిళ్ళు ధరిచేర్చుతూ వచ్చావే ఓ కరోనా ! వలస కూలీల బతుకు వల్ల కాడవుతుంటే తగుదునమ్మా అంటూ మము తరుమచూస్తావా? ఉన్నోళ్ళం, లేనోళ్ళం కలిసుండేటోలళ్ళం ఊళ్ళో పనిలేక, చేతిలో దమ్మిడిలేక పనికొరకు మేమoత పయనమైవెళితే కసాయిలా వెంటపడి మాకు కడగoల్లు పెడతావా? బతుకు బారమై బక్కచిక్కి మృత్యుగోసను మరిచి ముద్దు మురిపాలకు దూరమై ముసలి ముతకనొదిలి లాక్ డౌన్ లో ఉన్నాము. ఊహలే రెక్కలై పేగుబంధం తెంచుకుని పెద్దూళ్లకు వోతే, మాయదారి రోగమై మా- వెంట పెడతావా? ఏమే కరోనా ! ఎందుకిలా? వేదిస్తున్నావు మమ్మిలా? ఎందరున్నా ఒంటరి వాళ్లలా ఊరికి దూరమై దుఃఖిస్తున్నాము కలలు కల్లలుగా మార్చిన ఓ కరోనా ! నవయుగ రోగానివై మము నిలిచి పారేస్తున్నావు ఏం సాధిద్దామని ? ఇకనైనా వెళ్ళిపో..--- రచన :యం.లలిత. జన్వాడ, మండలం. శంకర్పల్లి.[ RR DIS KVMT VENKAT]


కామెంట్‌లు