మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి. --1911లో తండ్రి మహబూబలీఖాన్ మరణానంతరం ఏడవ నిజాముగా హైదరాబాద్ రాజ్య పాలకుడు ఉస్మానలీఖాన్ ఆసఫ్జాహీలలోనే కాదు రాచరిక వ్యవస్థలోనే చివరి ప్రభువు.ప్రపంచస్థాయిలో అత్యంత సంపన్నుడుగా పేరుపొందిన ఇతడు అత్యంత పిసినారిగా కూడా పేరుపొందాడు.అయితే ఈ పిసినారి తనం తన జీవితానికి మాత్రమే పరిమితం.అర్థం కాలేదు కదూ! అయితే వినండి.ఒకరోజు ఒక నౌకరు 25 రూపాయలిచ్చి అంగడిలో గొంగడి (బ్లాంకెట్) తెమ్మని పంపాడట.ఆ నౌకరు తిరిగి వచ్చి అంగడిలో 35రూపాయల కంటే తక్కువ ధరలో బ్లాంకెట్లు లేవని చెప్పాడు.సరే అని ఇంకో పది రూపాయలిచ్చి పంపించే బదులు ,ఇచ్చిన ఇరవై ఐదు రూపాయలు తీసుకుని ‘అయితే పాత దానినే వాడుకుంటా’అని చెప్పాడట.అతి నిరాడంబర వ్యక్తిగత జీవితం గడిపాడనటానికి ఇది ఒక ఉదాహరణ.దాన్నే పిసినారి తనంగా జమకట్టారు.కానీ అదే సంవత్సరం బికనీర్ మహారాజావారు హిందూ విశ్వవిద్యాలయ నిర్మాణానికి సహాయమర్థించగా లక్ష రూపాయలు పంపించాడట.ఇది ఆయన ఉదారతకు నిదర్శనం. ఏడవ నిజాం కాలంలో అనేక సంస్కరణలు జరిగాయి. *1914 లో పురావస్తుశాఖ ఏర్పడింది. *1919లో నూతన రాజ్యాంగము ప్రవేశపెట్టబడి,దానికి ఒక కార్య నిర్వాక మండలి ఏర్పాటు చేయబడింది. *1922 లో న్యాయ శాఖ వేరు చేయబడింది. *1923 లో ఆసఫ్జాహీ వంశమేర్పడిన ద్వి శతాబ్ది ఉత్సవాలు జరిగాయి.*1927 లో ఉస్మానియా మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబడింద. *1929 లో ఉస్మానియా ఇంజినీరింగు కళాశాల ఏర్పాటు చేయబడింది. *1930 లో పురావస్తుశాస్త్ర ప్రదర్శనశాల ఏర్పాటుగావించబడింది. *1932 లో విమాన సర్వీసుల బోర్డు ఏర్పడింది. *1935 లో విమానాశ్రయమేర్పడగా కరాచీ నుండి మద్రాసు పోయే విమానం ఆగడానికి వీలుకలిగింది. *1936లో జరగాల్సిన నిజాం పరిపాలన రజతోత్సవాలు రాజ్యమంతటా 1937లో జరిగాయి. ఆ సందర్భంగానే నిజాం గౌరవార్థం కరీంనగర్ ,పెద్దపల్లి ,జగిత్యాలలలో కమాన్లు నిర్మించబడ్డాయి.*1939 లో 1400 ఎకరాల స్థలములలో 36 లక్షల వ్యయంతో నిర్మించబడిన ఉస్మానియా విశ్వవిద్యాలయము నిజాము చేతులమీదుగా ఆవిష్్కరించబడింది. దీని నిర్మాణప పనులు 1919 లో ప్రారంభించబడ్డాయి.కనుకనే గత సంవత్సరము ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ద్యుత్సవాలు జరిగాయి.ఇవే గాక,హైకోర్టు భవనము, ఉస్మానియా ఆసుపత్రి భవనము,జూబిలీ హాలు,అఫ్జల్ గంజ్ లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ,పబ్లిక్ గార్డెన్ లో మ్యూజియమ,బాలభవన్,ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్ వంటి నిర్మాణా లెన్నియో జరిగాయి.ఏడవ నిజాము కాలంలోని ిర్పూరులో కాగతపు మిల్లు , వరంగల్ లో ఆజంజాహీ బట్టల మిల్లు వంటి పాపరిశ్రమలు నెలకొల్పబడ్డాయి.ఇంతటి నిజాము ఎదుటివాళ్ల వారిని సిగరెట్ల అడిగి తీసుకుని కాల్చేవాడట.(సశేషం)


కామెంట్‌లు