సీతానగరం హైస్కూల్ విజయనగరం జిల్లాలో గల నాలుగైదు పెద్ద స్కూళ్లలో ఇది ఒకటి. ఒకనొకప్పుడు అంటే 1957 నుండి 60, 70 దశకాలలో దానికి గల పేరుప్రఖ్యాతులు యెనలేనివి. అలానే ఆ పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఎన్నో పేరుప్రతిష్టలు ఉండేవి. అలా ఉండేవంటే వారు పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభివృద్ధికి ఎంతగా కృషిచేసేవారో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఒక గొప్పతనం ఉంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్పేముందు టెక్స్ట్ బుక్ లో ఆ పాఠాన్ని ఒకసారి దీక్షతో చదివి, అందుకు సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ కష్టపడి చదివి, ఆ విషయాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా సులభతరంగా చెబితే విద్యార్థుల భవితవ్యం చాలా బాగుంటుంది. అందరు ఉపాధ్యాయులు అదేవిధంగా కష్టపడి పనిచేస్తే పాఠశాల ఫలితాలు బాగుంటాయి. పాఠశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమ డింప చేస్తాయి. పాఠశాల పేరుప్రఖ్యాతులు ఒకా నొక పీరియడ్ లో ఉచ్ఛస్థితిలో ఉన్న పాఠశాల యొక్క పేరు భవిష్యత్ కాలంలో పతనమైందంటే దానికి కారకులెవరు? ముఖ్యంగా ప్రధానోపాధ్యా యుని పాత్ర అధికంగా ఉంటుంది. అతని ప్రవర్తననుసరించే మిగిలిన ఉపాధ్యాయులు ,విద్యార్థులు ప్రవర్తిస్తుంటారు. ప్రధానోపాధ్యా యుడు క్రమశిక్షణ పాటించక అనుకున్న టైంకు పాఠశాలకు రాకుంటే మిగిలిన టీచర్స్ అదే బాటను పడతారు.ప్రధానోపాధ్యాయుడు అనుకున్న టైంకు తన పీరియడ్ కు వెళ్లకపోతే మిగిలిన టీచర్స్ కూడా అదేపని చేస్తారు. అప్పుడే విద్యార్థులలో ఇన్-డిసిప్లిన్ క్రియేట్ అవ్వడానికి భీజం పడుతుంది. ఆ క్రమశిక్షణా రాహిత్యమే స్టాఫ్ లో తగాదాలకు దారితీస్తుంది. హెడ్మాష్టరు తన పీరియడ్ కు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడితే తన పీరియడ్ ను తీసుకోమని మరొకరికి ఎన్ట్రస్ట్ చేయాలి. ప్రధానోపాధ్యాయుడు తన పీరియడ్ కువెళ్లగలిగే స్థితి ఉండికూడా తన క్లాసుకు వెళ్ళడం మానకూడదు. ప్రధానోపాధ్యాయుని ఆరోగ్యం బాగులేక వారం పది రోజులు అవసరం వచ్చిన ప్పుడు కూడా ఏదో విధంగా ఎవరినో టీచర్ నుక్లాసుకు పంపించేసి కాలంగడిపేద్దాం అనే భావం ఉండకూడదు. ఆటీచర్లే మరికొన్నాళ్ళయేసరికి వెనుక నుండి ప్రచారం చేసి ప్రధానోపాధ్యాయుని ప్రిస్టేజ్ ను దెబ్బతీస్తారు. అకారణంగా ఏ సందర్భం లో కూడా ఏ టీచర్ ను కూడా తన పీరియడ్ కు అనుమతించకూడదు. తనకు ఏ లీవ్ ఉంటే ఆలీవ్ పెట్టుకోవడం మంచిది. ప్రధానోపాధ్యాయుడు అలా చేస్తే ఏ ఉపాధ్యాయుడూ నోరెత్తే పరిస్థితి ఉండదు. నేను ప్రధానోపాధ్యాయునిగా ఉండిఇక్కడ మీకు ఏం చెప్పానో అదే చేసేవాడను. ప్రధానోపాధ్యాయునిగా మనం ఒక రైట్ వే లో వెళ్ళాలన్నదే నాఉద్దేశం.ఇక విద్యార్థుల విషయాని కొస్తే నేను ఆ స్కూలుకు వెళ్లిన కొత్తలో రెండు రకాలైన విద్యార్థులు నా దృష్టిలో పడ్డారు. మొదటివారు హాస్టల్ స్టూడెంట్స్..వీరందరికీ హాస్టల్ వార్డెన్ ఏడు గంటలకు వేడి అన్నం వండీ బ్రేక్ -ఫాస్ట్ పెడతారు. కొందరు విద్యార్థులు ( పెద్ద తరగతుల విద్యార్థులలో కొందరు) బ్రేక్-ఫాస్ట్ ఉదయం తినడం మానేసి స్కూలుకు లేటుగా వచ్చేవారు. ఏం లేటుగా వస్తున్నారని అడిగితే హాస్టల్ వార్డెన్ టైంకు భోజనం పెట్టడంలేదని చెప్పేవారు. రెండు పూటలు అటెండెన్స్ వేయించు కొని క్లాస్ టీచర్ కు పెర్మిషన్ అడిగి ఇంటర్వెల్ లో పుస్తకాలను ఫ్రెండ్స్ కిచ్చేసి హాస్టల్ కు వెళ్లి అక్కడ అల్లరిచేయడమో లేక నిద్రపోవడమో చేసేవారు. భోజనానికి సంబంధించిన విషయం పై వార్డెన్ నుఅడుగుదామని అతనిని స్కూలుకు పిలిపించాను. అందరికీ టైం ప్రకారము భోజనాలు బెట్టి పంపిస్తున్నామని, క్లాసులు ఎగ్గొట్టడానికే ఇలా చేస్తున్నారని వార్డెన్ చెప్పారు. ఆ మరుచటి దినం నుండి ఆకలితో ఉన్నారని ఏ ఒక్కరినీ క్లాసులు నుండి విడిచిపెట్టకూడదని చెప్పాను. ఇక రెండవ రకం. లేటుగా వచ్చేవారి తల్లి దండ్రులను పిలిపించి విద్యార్థుల విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పడంతో ఆ విద్యార్థులు క్రమశిక్షణలో పడ్డారు.ఇన్ని విధాలుగా తీర్చిదిద్దిన పాఠశాలను ఒక్క క్షణం కూడా విడిచి ఎం. ఇ. ఓ గా వెళ్ళేటందుకు మనసు అంగీకరించ లేదు. అయినా తప్పదు మరి. (సశేషం ) శివ్వాం.ప్రభాకరం, బొబ్బిలి ఫోన్ :7013660252.


కామెంట్‌లు