కొమరం సోంబాయి--నిర్యాణం: 22జూన్1993-- దక్షిణభారత గిరిజనయోధుడు "గోండు సూరీడు- కొమరం భీమ్"(1901- 1940), నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి తన గోండుజాతి స్వేచ్చకోసం హక్కుల పరిరక్షణ కోసం నిస్వార్థంగా పోరాడి అమరత్వం పొందిన వీరుడు, అంతటి యోధుడికి తోడు నీడగా వుండి "జోడెన్ ఘాట్ " లో జరిగినపోరులో నైజాం దమనకాండకు బలిఅయిన భీమ్ మృతదేహ జ్వాలను కళ్లల్లో నింపుకుని ఆ పోరాటయోధుడి పోరాటస్పూర్తికి తొలిచిరునామాగా నిలిచిన అడవిబిడ్డ " కొమరం సోంబాయి", తన భర్తచేసేపోరాటం తదితర పూర్తి ఎత్తులు వ్యూహాలు గురించి అంతగా అవగాహన లేక పోయిన తన పెనిమిటి చేసే ప్రతి పనికి నమ్మకం తో కూడిన సాకారం అందించిన సాధ్విమణి "సోంబాయి" , భీమ్ మరణానంతరం అతని వారసత్వ సంపదలైన బిడ్డలను పెంచి పోషించి నేటితరానికి భీమ్ వారసులను అందించిన తల్లి, తాను నివసించే "దోబె" గ్రామానికె పరిమితం అయిన సోంబాయి ని బాహ్యప్రపంచానికి పరిచయం చేసింది ప్రముఖ చారిత్రక నవలా రచయిత " ఎస్. ఎమ్. ప్రాణ రావు"(సరబాద ముఖ్య ప్రాణ రావు)1990మార్చి నెలలో జోడెన్ ఘాట్ సమీపం లోని "దోబె" గ్రామం సందర్శించి 85 సంవత్సరాల వయసులోని సోంబాయిని కలిసి భీమ్ తో ఆమెకుగల సాన్నిహిత్యం భీమ్ వ్యక్తిత్వం గురించి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని బాహ్యప్రపంచానికి పరిచయంచేసారు, ఒకగిరిజన యోధుడి పోరాటానికి సజీవసాక్ష్యం అయిన "సోంబాయి" తన 88వ ఏట 22జూన్ 1993న శాస్వంతంగా కన్నుమూసింది. గిరిజయోధుడి జీవనపోరాటఅర్ధభాగం అయిన"కొమరం సోంబాయి" 17వ వర్ధంతి(జూన్22)సందర్బంగా ఆమెను స్మరించుకుందాము. --డా:అమ్మిన@తెలుగుసేవకుడు


కామెంట్‌లు