నిజాయితీ తెచ్చిన బహుమతి. (బేతాళకథ6) డా.బెల్లంకొండనాగేశ్వరరావు.----పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపై శావాన్ని ఆవహించి ఉన్న బేతాళుని భుజంపై వేసుకుని బయలుదేరాడు.విక్రమార్కుని భుజం పైనున్న బేతాళుడు'మహీపాలా నువ్వు నాలుగు వేదాలు,మనుస్మృతి-బృహస్పతి-దక్ష-గౌతమి-యమ-అంగీరస-యాజ్ఞవల్క్య-ప్రచేత-శతాతప-పరాశర-సంవర్త-వౌశనస-శంకర-లిఖిత-ఆత్నేయ-విష్ణు-ఆపస్తంబ-హరీత వంటి స్మృతులను,కణ్వ-కపిల-లోహిత-దేవల-కాత్యాయన-లోకాక్షి-బుథ-శతాతప-అత్రి-ప్రచేత-దక్ష-విష్ణు-వృధ్ధ-థౌమ్య-నారద-పౌలస్యఉత్తరాంగీస-విష్ణువృధ్ధ వంటి ఉపస్మృతులను అధ్యాయంనం చేసిన విద్యావేత్తవు నీవు.నాకు చాలాకాలంగా ఒక సందేహం ఉంది.దాన్ని నీకు మన ప్రయాణ బడలిక తెలియకుండా కథా రూపంలో చెపుతాను విను....అమరావతి రాజ్యంలో ఖజానా నిర్వాహకుడి పదవికి అర్హతతోపాటు నిజాయితీ కలిగినవ్యక్తి ని నియమించే బాధ్యత మంత్రి సుబుద్ధి తీసుకున్నాడు. అందుకు సరిపడా అర్హతలుఉన్న ఇద్దరు యువకులు వచ్చారు,వారిలో నిజాయితీపరుడైన వారిని ఎంపిక చేయడానికి మంత్రి వారితో మాట్లాడుతున్న సమయంలో ,ఓయువకుడు వచ్చి'అయ్యా నేను రత్నం శెట్టి గారి అబ్బాయిని, నాన్నగారు పోయిన వారం మీవద్ద రెండువేల వరహాలు తీసుకున్నారట అవి తిరిగి మీకు ఇచ్చిరమ్మన్నారు' అని,రెండు వరహాల మూటలు అందించి 'ఒక్కో మూటలో వేయి వరహాలు ఉన్నాయి లెక్కించండి'అన్నాడు. 'లెక్కించే సమయంలేదు నువ్వు వెళ్ళిరా'అన్నాడు మంత్రి.ఆయువకుడు వెళ్ళి పోయాడు. 'నాయనలారా నేను రాజు గారిని అవసరంగా కలవాలి నేను వెళ్లి వస్తాను.ఈ లోపుమీరు భోజనం ఇక్కడే ఏర్పాటుచేసాను. మీ ఇరువురు భోజనానంతరం ఈ మూటలోని వరహాలు సరిగ్గా ఉన్నవో లేవో లెక్కచూసి నాకుసాయంత్రం అప్పగించండి.మీకు గదులు కేటాయించాను.మీ మీ గదిలోనికే భోజనం వస్తుంది వెళ్లండి' ఉద్యోగవిషయం తరువాత మాట్లాడతాను అని చెరి ఒక వరహాల మూట అందించి మంత్రి రాజ సభకు వెళ్ళి పోయాడు.భోజనానంతరం ఇద్దరు యువకులు కొంతసేపటి తరు వాత వారి గదులలో వరహాలమూటలు లెక్కించారు. సాయంత్రం వచ్చిన మంత్రిని కలసి తమకు ఇచ్చిన వరహాలమూట అందించి 'సరిపోయాయి వేయి వరహాలు ఉన్నాయి'అన్నాడు మొదటి యువకుడు.రెండో యువకుడు తన చేతిలోని వరహాల మూట మంత్రి చేతికి అందిస్తూ'ఇందులో రెండు వరహాలు ఎక్కువ ఉన్నాయి'అన్నాడు.రెండో యువకుని చేతిలోని వరహాలమూట అందుకుంటూ 'నాయనా రేపటి నుండి నీవు కోశాధికారి పనిలో చేరు. అన్నాడుమంత్రి.'విక్రమార్క మహారాజా మంత్రి ఇద్దరిని పరిక్షించి మెదటి యువకుని కాదని రెండోయువకుడే నిజాయితీ పరుడని ఎలా నిర్ణయించి కోశాధిపతి పదవి అప్పగించాడు.తెలిసి నిజం చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు.అన్నాడు బేతాళుడు.'బేతాళా మంత్రి చాలా తెలివిగా వారి నిజాయితీ పరిక్షించాడు. ముందుగా తను ఏర్పాటు చేసిన మనిషి ద్వారా ఒక్కో వరహాల మూటలో వేయి ఒక్క వరహాలు పెట్టించాడు.ఇరువురు యువకులను లెక్కించే పని అప్పగించినప్పుడు మెదటి యువకుడు ఎక్కువ గాఉన్న ఒక్క వరహాను తను తీసుకుని వేయి వరహాలు మూటకట్టి మంత్రికి అందించాడు రెండో యువకుడు వరహాలు లెక్కించి ఎక్కువ వచ్చిన వరహాతో సహా మంత్రికి లెక్క చెప్పి తన నిజాయితీని చాటుకున్నాడు. అందుకే కోసాధికారి పదవి అతనికి లభించింది.అంటే నిజాయితీకి బహుమతి లభించింది'అన్నాడు విక్రమార్కుడు.విక్రమార్కునికి సమాధానం విన్న బేతాళుడు శవంతో సహా మరలా చెట్టుపైకి చేరాడు.పట్టువదలని విక్రమార్కుడు మరలా బేతాళునికై వెను తిరిగాడు.


కామెంట్‌లు