భూమిపై తొలి విశ్వవిద్యాలయం నలంద. డా.బెల్లంకొండనాగేశ్వరరావు.---- ప్రపంచంలో తొలి విశ్వవిద్యాలయం నలంద అది భారత దేశంలో ఉండటం మనందరికి గర్వ కారణం.హర్షవర్ధనుడు క్రీ.శ.647 మరణించాడు.ఇతని ఆస్ధానంలో దీర్ఘకాలంగా ఉన్న చైనా యాత్రికుడు హ్యూన్ త్సాంగ్,ఇతనుతొలుత పశ్చిమోత్తరంగుండా భారతదేశంలో ప్రవేశించాడు.కాశ్మీర్,సియాల్ కోట్,జలంధర్ మీదుగా కనోజ్ చేరుకున్నాడు.హర్షుని సన్మానాలు అందుకుని,ప్రయాగ,కాశీ,బుద్ధగయలు సందర్శించి,అస్సాం, బెంగాలు, ఒరిస్సా మీదుగా ఆంధ్రాలో నాగార్జున కొండను, శ్రీపర్వతాన్ని చూసి,కంచి వెళ్లి,మైసూర్ మీదుగా మహరాష్ట్రా వెళ్లి,చాళుక్య రాజధాని వాతాపి చూసి నలంద చేరుకున్నాడు.అతను భారతదేశం వదలివెళ్లే సమయంలో బుద్ధుని అస్తికలతో పాటు పలు విలువైన తాళపత్ర గ్రంధాలు ఇరవై గుర్రాలపై చైనాకు తీసుకు వెళ్లాడు.వోల్టేర్,పియరి డి సోన్నెరేట్,షెలింగ్,జాన్ హోల్వెల్ వంటి ఐరోపాలోని చాలామంది ప్రముఖ మేధావులు భారతదేశాన్ని"నాగరికత యొక్క ఊయల" గా పిలుస్తారు.మరియు భారతదేశం ప్రపంచంలోని దాదాపు ప్రతిపురాతన మరియు మధ్యయుగ నాగరికతతో మేధో సంబంధాలను పంచుకుంటుంది అనేది నిజం.రాజకీయ కారణాలవలన భారతదేశ చరిత్ర మరియు నాగరికత ప్రపంచంలో చాలాతక్కువగా అంచనా వేయబడింది. వాస్తవం ఏమిటంటే,ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే భారతదేశం జ్ఞానరంగంలో ఎంతో దోహదపడింది.పశ్చిమాన మధ్యధారా సముద్రం దగ్గర ఉన్న దేశాలనుండి తూర్పున చైనా సముద్రవరకు విద్యార్దులు భారత దేశంలో చదువుకోవడానికి వచ్చారు.కానీ ఏ భారతీయ విద్యార్ది చదువుల కొసం ఈదేశంనుండి వేరే దేశం వెళ్లినట్లు చెప్పలేదు.క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంనుండిక్రీస్తుశకం 12 వ శతాబ్దవరకు అంతర్జాతీయ అభ్యాస ప్రదేశంగా భారతదేశం వెలుగొంది.ఎందుకంటే తక్షశిల,నలందా,మరియు విక్రమశిల, వంటి గొప్ప అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు మనకు ఉండేవి. ప్రారంభ మధ్యయుగ కాలంలో ఈ విశ్వవిద్యాలయాలు కుప్పకూలిన తరువాత కూడా,భారతదేశం ముస్లిం ప్రపంచానికి గణితం,సంగీతం, చదరంగం,ఆయుర్వేద,రసాయనశాస్త్రం,జ్యోతిష్యశాస్త్రం,పంచతంత్రమరియు కొన్నిహిందూ గ్రంథాలు వంటి అనేక ప్రత్యేకమైన విషయాలను నేర్పించిన లేదా ఇచ్చినందున అంతర్జాతీయ అభ్యాస దేశంగా మనదేశంఉంది.ఇది అల్-బెరుని మరియుఅమీర్ ఖుష్రో వంటివారు స్పష్టంగా తెలిపారు.ప్రాచీన ప్రపంచంలో అలెగ్జాండ్రియాలోని ఏథెన్స్ మరియు మ్యూజియంలో లైసియం వంటి అనేక అభ్యాస స్తానాలు ఉన్నాయి.బైజాంటైన్ (క్రీ.శ.843లో స్ధాపించబడింది.)అల్-కరౌయిన్(క్రీ.శ.859)అల్ అజార్ (క్రీ.శ.975) బోలోగ్నా (క్రీ.శ.1088)పారిస్ (క్రీ.శ.1160)ఆక్స్ఫర్డ్.(క్రీ.శ.1167) కేంబ్రిడ్జి (క్రీ.శ.1209)పలాన్సియా(క్రీ.శ.1212)సలామాంకా(క్రీ.శ.1218)పాడుగా (క్రీ.శ.1222)టౌలౌ(క్రీ.శ.1229)మెదలైనవి మధ్యయుగ కాలానికి చెందిన ప్రసిద్ద విశ్వవిద్యాలయాలు.కాని వీటిలో ఏదీ అభివృధ్ధి చెందిన మౌలిక సదుపాయాలు మరియు పాఠ్యాంశాలు కలిగినటువంటి తక్షశిల, నలంద, విక్రశిలా వంటివి పైన చెప్పిన వాటిలో లేవు. అనాటికే భారతదేశంలో పలు విశ్వవిద్యాలయాలు ఉండేవి.అలెగ్జాండర్ దండయాత్ర నాటికే తక్షశిల ప్రసిద్ధిచెందింది.ఉజ్జయిని మరోకటి.దక్షణాన నాగార్జున కొండ విశ్వవిద్యాలయం క్రీ.శ.200ప్రాంతంలో అభివృధ్ధిచెందింది. అన్నింటిలోకి నలంద విశ్వవిద్యాలయం శిఖరోన్నతం అంటే అతిశయోక్తి కాదు.హర్షునికాలంలో విలసిల్లిన ఈవిశ్వవిద్యాలయం.నలం అంటే సంస్కృతంలో పద్మం అని అర్ధం.ఇది జ్ఞానానికి గుర్తు.ద అంటే ఇవ్వడం.వెరసి..జ్ఞానాన్ని అందించేది నలందా అని అర్ధం.దీనికి గుప్తరాజులలో చివరివాడైన బాలాదీత్యుడు నలందా విశ్వవిద్యాలయంకు ప్రారంభోత్సవంచేసాడు.ఉత్తరాదిని పాలించిన రాజులు అందరూ నలందను ఆదరిస్తూనే వచ్చారు.హర్షవర్తనుడు ఇట్టిదాతలలో అగ్రగణ్యుడు.ఈవిశ్వవిద్యాలయంలో పదివేలమంది చదువుకునే అవకాశం ఉండేది.దేశ దేశాల విద్యార్ధులు,పండితులు ఇక్కడ చేరేవారు. అదొక అంతర్జాతీయ విశ్వవిద్యాలయం.బౌధ్ధతత్వశాస్త్రం తోపాటు,సాంఖ్యా, వైశేషిక,యోగ,తర్కమీమాంసాది దర్శన శాస్త్రాలన్నింటికి ఇక్కడఆచార్య పీఠాలు ఉండేవి.వ్యాకరణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉండేది.ఆకాలంలో విద్యార్దులు చాలాదూరం వెళ్లి విద్య అభ్యసించేవారు.విద్యలను 'అష్టాదశ'విద్యలుగా చెపుతారు. అవిఋగ్వేద, యజుర్వేద, సామ,అథర్వవేదాలు అనే నాలుగు వేదాలు. శిక్ష,వ్యాకరణము, ఛందస్సు,నిరుక్తము,జోతిష్యము,కల్ప,మీమాంస, న్యాయము, పురాణము,ధర్మశాస్త్రము మొదలగు వానితోకలసి పదునాలుగు విద్యలు. వీటికి ఆయుర్వేదము, ధనుర్వేదము,గాంభీర్యము, అర్ధశాస్త్రము లను జోడించితే అష్టాదశ విద్యలు అవుతాయి.నలందావిశ్వవిద్యాలయ ద్వారపాలకులు సైతం మహాపండితులు. విద్యార్ధులను మొదట పరిక్షించేదివీరే.రేయింబవళ్లు వాద ప్రతివాదాలతో, చర్చలతో నలందా విశ్వవిద్యాలయం ప్రతిధ్వనిస్తుండేది.ఇక్కడ ఆచార్యులుగా స్థిరమత,ధర్మపాల,వసుభంధు,శీలభద్ర వంటి వారు ఉండేవారు.నాగార్జుని రచనలు ఎన్నో ఇక్కడ రక్షింపబడి పిమ్మట టిబెట్టు చేరుకున్నాయి.నలందాలో ఎనిమిది కళాశాలలు ఉండేవి.సుమిత్రా పాలకుడు, బలపుత్రదేవుడు నిర్మించిన కళాసాలలో రత్నసాగర,రత్నోదధి, రత్నరంజిక అనే మూడు గ్రంధాలయాలు ఉండేవి. చైనా, కొరియా, టిబెట్,ఇండోనేషియా,పర్షియా,టర్కి, సుమిత్రా,జావా, సింహళ, మధ్యఆసియా నుండి వేలాదిమంది విద్యార్ధులు ఇక్కడకు తరలి వచ్చేవారు.లక్షా యాభైవేల చదరపు మీటర్లకు పైగా వ్యాపించి,ఎనిమిది ప్రత్యేక ప్రాంగణాలు,పది ప్రార్ధనా మందిరాలు,ఉద్యానవనాలు, చెరువులు, మరెన్నో అపురూప కట్టడాలు ఇక్కడ ఉండేవి.వేల మంది అధ్యాపకులు,విద్యార్దులను వధించి, గ్రంధాలయానికి నిప్పుపెడితే కొన్ని నెలలు దగ్ధమైయింది అంటే,ఆ తొమ్మిది అంతస్తులలో ఉండే గ్రంధాలయ వైభవం మనంఊహించుకోవచ్చు. విద్యార్ధులకు భోజన,వసతి సౌకర్యం కలిగించిన తొలి విశ్వవిద్యా లయం నలంద. అలా ప్రపంచానికి తొలుత విద్యాదానం చేసింది మన భారతదేశమే!పలు ముష్కర దాడుల్లో నలంద శిధిల మైయింది.1197 లో టర్కి రాజు ఖిల్జీ ఈ ప్రాంతంపై దాడి చేసి ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసాడు ఇక్కడ మన విద్యా విశిష్టత గురించి కొంత తెలుసుకుందాం! గెర్రిపెటో అనే చరిత్రకారుడు మనదేశం గురించి ఇలా అంటాడు.తూర్పు ఇరాన్ లోని ఉన్నత పీఠభూమి,టిబెట్ మరుభూములు మంగోలియా,మంచూరియాలు,ప్రాచీన చైనా-జపాన్ లు ప్రాధమిక నాగరిక దశలో జీవిస్తున్నా ఇండో చైనాదీవులు,మలయా ద్వీపం,ఇండోనేషియా-వీటన్నింటిలోనూ భారతదేశం తన శాశ్వితమైన ముద్రనువేసింది.ఆదేశం మతం మాత్రమేగాక,కళా, భాషా,సంస్కారలన్ని భారతీయప్రభావాన్ని కలిగి ఉన్నాయి. గుప్తరాజులకాలంలో,శాస్త్రీయవిజ్ఞానం గణనీయంగా వృధ్ధి చెందడం ఆ కాలం ప్రత్యేకత.అన్ని శాస్త్రాలకు మూలం గణితం.వ్యాపార అభివృధ్ధికి అత్యవసరం బీజగణితం.రేఖాగణితం మరీ ముఖ్యం.ఇవన్ని గుప్తరాజు కుమారగుప్పుని కాలంలో క్రీ.శ.427 మొదలై 450 నాటికి పూర్తిస్ధాయి నిర్మితమై వృద్ధి చెందింది. పదివేలకు పైగా విద్యార్ధులు,రెండు వేలమంది అధధ్యాపకులతో కళకళలాడుతూ ఉండేది.గణితశాస్త్రంలో సున్నా భారతీయులు ఏనాడో కనుగొన్నారు. భారతదేశంనుండి అరబ్ దేశాలమీదుగా ఆవిజ్ఞానం యూరప్ వెళ్లింది. క్రీ.శ.476 లో పాటలీపుత్రం(నేటి పాట్నా) లో ఆర్యభట్టు జీవించాడు.ఇతను ప్రసిధ్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు.భూమి తనచుట్టు తను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిబ్రమిస్తుందని కనిపెట్టినవాడు.గ్రహణాలను లెక్కగట్టాడు.దశాంశ గణిత పద్దతి ప్రవేశపెట్టాడు.ఇదేకాలంలో మరోశాస్త్రవేత్త వరాహిమిహిరుడు. ప్రకృతి విజ్ఞాన శాస్త్రాలను గురించి ఎంతో కొంత పరిశోధించి నూతన విషయాలు వెలికి తెచ్చాడు.చరకుడు,శుశ్రుతుడు అంతకుముందే ఉన్నారు.వైద్యశాస్త్రం,గుప్తరాజుల కాలం లో బాగా అభివృధ్ధి పొందింది.రసాయన,బౌతిక,విజ్ఞాన శాస్త్రాలు లేనిదే వైద్యశాస్త్రంలేదు. సింధూ నుండి అరబ్ వర్తకులు,శాస్త్రజ్ఞీలు భారతీయ సరుకులతోపాటు, ఇక్కడి విజ్ఞానాన్ని,తత్వశాస్త్రాన్ని బాగ్దాద్చే రవేశారు.భారతీయ వైద్యులు పెక్కుమంది క్రీ.శ.900లో,బాగ్దాద్ లో హరూన్ అల్ రషీద్ ఆస్ధానంలో ఉండేవారు.అరేబియన్ నైట్స్ కథలు ఈరాజు ఆస్ధానంనుండే ఉద్బవించాయి.బీహార్ ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న విశ్వవిద్యాలయాన్ని నలంద చేరువలో నిర్మించనుంది. తమ వద్దఉన్న అపురూప కళాఖండాలను ఈ విశ్వవిద్యాలయానికి ఇస్తామని దలైలామా 2007 లో ప్రకటించారు. ఈవిశ్వవిద్యాలయనిర్మాణానికి 400 కోట్లకు పైగా కర్చు చేయనున్నారు. అందుకుగాను నియమింపబడిన కమిటి సారధిగా నోబుల్ బహుమతి గ్రహిత అమర్త్యసేన్ ఉంటారు.ఈబృందంలో సగటా బోస్ (నేతాజి మేనల్లుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రోఫెసర్ )సింగపూర్ విదేశాంగ మంత్రి,చైనా,జపాన్ దేశాలకు చెందిన మంత్రులు పలువురు విద్యాప్రముఖులు ఉన్నారు.విశ్వవిద్యాలయం ఏర్పాటు జరిగిన తరువాత తొలి దశలో పి.జి.ఆపైస్ధాయి విద్యను అభ్యసించేవారికి ఏర్పాట్లు చేయనున్నారు.ప్రతి పదిమంది విద్యార్దులకు ఒక అధ్యాపకుడు చొప్పున ఉంటారు.ఈవిశ్వవిద్యాలయంలో 46 మంది విదేశీ,400 మంది భారతీయ అధ్యాపకులు ఉండేలా చూస్తారు.నలంద విశ్వవిద్యాలయ శిధిలాల ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని భారత ప్రభుత్వం యునెస్కోకు విజ్ఞప్తి చేసింది.
Popular posts
పని!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
యుటిఎఫ్ పాటల పోటీల్లో విజేతలు వీరే
• T. VEDANTA SURY
ఉపాధ్యాయుడు!!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కుదమ తిరుమలరావు పరిచయం
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి