నాపేరేమిటి?(బేతాళకథ)7.డా.బెల్లంకొండనాగేశ్వరరావు.చెన్నయ్ . పట్టువదలని విక్రమార్కుడు మరలా మోదుగ చెట్టుకు వేళ్లాడుతున్న శవాన్ని భుజాన వేసుకుని మౌనంగా బయలుదేరాడు.శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు'మహిపాల నన్ను బంధించి నీవు తప్పుచేస్తున్నావు నేను చాలా శక్తిమంతుడను.నీగురించి నాకు పూర్తిగా తెలుసు.ఈశ్వరుని నుండి ఇంద్రుని వరప్రసాదమైన నవరత్నఖచిత పీఠమైన,నెమలి ఆకృతి కలిగిన బంగారు సింహాసనానికి కలిగిన మెట్లపై ఉన్న సాలభంజికాలు (బొమ్మలు)లపేర్లు చెపుతానువిను ...శృంగారతిలక ,జయ,విజయ ,మలయవతి, ఆనంద సంజీవని ,గంధర్వసేన ,ఐప్రభావతి ,సుప్రభ,సంభోగనిధి, సుభద్ర, చంద్రిక ,కురంగనయన, అనంగధ్వజ, ఇందువదన,విలాసరసిక,కోమలి, సౌదర్యవతి, లావణ్యవతి, లజ్జావతి, ఇందుమతి,జనమోహిని,విద్యాధరి,హరిమధ్య,సుఖప్రదాయని,ప్రభోధవతి,మలయవతి,హంసగమన,అంగసుందరి,సుకేసి చతురిక, వామాంగి, తలోదరి.వంటి వారుఉన్నారు'అన్నాడు.మౌనంగానడవసాగాడు విక్రమార్కుడు. 'మహరాజా నాకు చాలా కాలంగా అర్ధంకాని సమస్య ఉంది. సకల కళావల్లభుడవు,కాళీమాతా వరప్రసాదివి నీవే నాసందేహన్నినువ్వే తీర్చాలి దాన్ని నా పేరేమిటి అనే కథారూపంలో మనప్రయాణంలో నీకు అలసట తెలియకుండా చెపుతాను విను ...పూర్వం అమరావతిరాజ్యాన్ని చంద్రసేనుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు.అతను ఓక రోజు సామంత ,నగరపాలకులు,ప్రజలతో సభతీరి ఉండగా ఓవిప్రుడు సభలో ప్రవేసించి 'మహారాజా నేను సకలకళాకోవిదుడను.ఈసభాముఖంగా,నేను ఓక ప్రశ్న అడుగతాను దానికి మీరాజ్యంలో ఎవరైనా సమాధానం చెప్పగలరా'అని రాజుగారి అను మతితో 'నాపేరులో ఆరు అక్షరాలు ఉన్నాయి.అందులో మొదటి అక్షరం తీసివేస్తే, అశ్వవేదిని అవుతాను.రెండుఅక్షరాలు తీసివేస్తే, నాట్యకర్తను అవుతాను.మూడు విడదీస్తే,గతవిదుడ అవుతాను.నాలుగు తీస్తే,చాలానేర్పరిని అవుతాను.అయిదు అక్షరాలు వదిలేస్తే,బుధుడను అవుతాను.అలాకాకుండా ఆరుఅక్షరాలు కలిపి చదివితే, బుధ్ధిబలమున్న వాడిని అవుతాను.మరినాపేరు ఏమిటి 'అన్నాడు విప్రుడు. కథచెప్పడం ఆపిన బేతాళుడు 'రాజా నీవు విద్యలో నీవు గొప్పవిద్వత్ కలవాడివి.ఆవిప్రుని పేరు ఏమిటి తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు'అన్నాడు. 'బేతాళా విప్రుడు చాలా తెలివైనవాడు.అతనిపేరు 'చతురంగ తజ్ఞు'అన్నడు విక్రమార్కుడు.విక్రమార్కునికి మౌనభంగం కావడంతో శవంతోసహ బేతాళుడు మాయమైపోయాడు.పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.(కల్పితం)
Popular posts
పని!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
యుటిఎఫ్ పాటల పోటీల్లో విజేతలు వీరే
• T. VEDANTA SURY
ఉపాధ్యాయుడు!!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
• T. VEDANTA SURY
జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కుదమ తిరుమలరావు పరిచయం
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి