ప్రతిధ్వని --సుజాత.పి.వి.ఎల్.---గోవుల కాపరి ఆవులను మేపుకుంటూ ఒక కొండ ప్రాంతానికి వెళ్ళాడు. ఆవుల్ని పిలిచే నిమిత్తం "హేహ్హే య్హేయ్" అంటూ అరిచాడు. ఆ వెంటనేతన స్వరాన్ని ఎవరో అనుకరించి అలాగే వచ్చిన శబ్దాన్ని విని ఆందోళన చెంది, "ఎవడ్రా నువ్వు?" అన్నాడు బిగ్గరగా. అంతకంటే వేగంగా మూడింతల శబ్దంతో తన పిలుపులాగే వచ్చిన శబ్దానికి భయపడి, ఎవడో తనని చాటుగా వుండి తిడుతున్నాడని, నువ్వెంత అంటే నువ్వెంత అంటూ మాటకి మాట జవాబిస్తున్నాడని భయపడి, అటుగా వెళుతున్న స్వామీజీకి జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాడు గోవుల కాపరి. అప్పుడా స్వామీజీ! " చిరునవ్వు తో..ఎవరూ నిన్ను తిట్టలేదు నాయనా, నిన్ను నువ్వే తిట్టుకున్నావ్ " అన్నాడు. " అదెలా స్వామీ! " అడిగాడు కాపరి. ఎవర్నీ అనవసరంగా దూషించ కూడదు. అలా చేసే చర్యలకి నిదర్శనమే ఈ ప్రతిధ్వనులు అని చెప్పాడు.


కామెంట్‌లు