ఈ పాప పేరు శ్రీనితి రాంగిరి, తల్లి రాధిక తండ్రి ప్రతాప్, గ్లెండేల్ ఇంటర్నెష్నల్ అకాడెమి స్కూల్లొ పదకొండవ తరగతి చదవుతోంది. తన తల్లిదండ్రుల ప్రొత్సహంతొ ఏడు సంవత్సరాల వయస్సు లో డాలస్ నగరంలో కూచిపుడి నాట్యం నేర్చుకొవడం మొదలుపెట్టింది. భారతదెషానికి వచ్చాక గురుకులం లో శ్రీమతి. తులసి పొపూరి గారి వద్ద కూచిపుడి నాట్యం గత నాలుగు సంవత్సరాలుగా నేర్చుకుంటుంది. శ్రీనితికి గురుకులంలో నేర్పించే విధానం వల్ల నాట్యం పట్ల ఆసక్తి పెరిగి నాట్యన్ని ఇంకా బాగా నేర్చుకోవాలి అనె పట్టుదల పెరిగింది.గురుకులం ద్వారా ప్రదర్షనాలు ఇచ్చిన శ్రీనితికి చిత్రలేఖనం మరియు ఇతర కళలలో ఎంతో ఆసక్తి ఉంది. చదువుతో పాటు కళలలో కూడా ప్రావిన్యం పొంది దెశానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావలన్నది తన కోరిక అని చెప్పింది.


కామెంట్‌లు