మోసపు వలల బాలులు ---గాజుపెంకుల్లో మురికి కూపాల్లో పెంటకుప్పల్లో విసిరేయబడిన ఏలోకపు శాపపు వసివాయని పసి బాలలు మీరు? అనాథల చితికి అంగవికలులై పెరిగి ఆకలి మంటల కుంపట్లకు భయంగుప్పిట్ల ఈసిడింపుల కంపనలకు బంధీలౌతూ పేటల పెంటల మంటల మాటుల కంటనీరెంత ఉబికినా చిత్రవధ చితికినా ఎవరన్నా లేమిగా జాలింత లేనిదిగా మీరేలోకపు విశ్వమంత నవ్వే మసిమాడిన పసిడి బాలురులు? నీరెక్కలే సాచే చాకిరి కిరికిరుల నీకాళ్ళే నడిచే బానిస సంకెళ్ళ ఇరుకుల ఇరుల అనాథాశ్రమాల చిత్రవధల చిత్తు చేయబడే మోసపు కక్షల వలయంలో చిక్కిపోయిన చిలిమివి రేపటి పొద్దు 'ఆశ'ల వలల విసిరేయబడిన బాల భానుడా! కలిమివి నీ రెక్కల కష్టాల కొలిమిలో ఉదయించే బలిమివి మీదేలోకము విసిరేసిన వసివాయని బాలురలు? జయంత్


కామెంట్‌లు